Webdunia - Bharat's app for daily news and videos

Install App

06-12-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు.. లలిత సహస్రనామం చదివినా..?

Webdunia
ఆదివారం, 6 డిశెంబరు 2020 (05:00 IST)
లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: ప్రభుత్వ కాంట్రాక్టర్లు, బిల్డర్లకు అధికారులు, పనివారలతో సమస్యలెదురవుతాయి. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించడం వల్ల అభాసుపాలయ్యే ఆస్కారం వుంది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనుల విషయంలో నిర్లక్ష్యం పనికి రాదు. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. 
 
మిథునం: పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. మీ పట్టుదల వల్ల శ్రమాధిక్యత, ధననష్టం ఎదుర్కొంటారు. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.
 
కర్కాటకం: విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు కార్మికుల వల్ల ఇబ్బందులు తప్పవు. ప్రముఖుల కలయిక మీకెంతో ఉపకరిస్తుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభించినా జార విడుచుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
సింహం: స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. మిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం సేకరిస్తారు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ సంకల్పం వాయిదా పడుతుంది. తలకు మించిన బాధ్యతలతో తలమునకలౌతుంటే కాస్త ఓపికగా వ్యవహరించండి.
 
కన్య: కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి చికాకులు తప్పవు. మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. గృహానికి కావలసిన విలువైన వస్తువులు అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటో మొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి.
 
తుల: సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలడంతో పొదుపు సాధ్యం కాదు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు.
 
వృశ్చికం: బ్యాంకు అపరిచిత వ్యవహారాల్లో మెళకువ అవసరం. స్త్రీలు, టీవీ ఛానల్స్ కార్యక్రమాల్లో రాణిస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలు దూరంగా ఉండటం మంచిది. స్థిరచరాస్తుల విషయంలో ఏకీభావం కుదరదు. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిది కాదని గమనించండి.
 
ధనస్సు: రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలడంతో పొదుపు సాధ్యం కాదు. స్త్రీల కోరికలు మనోవాంఛలు నెరవేరుతాయి. ఉద్యోగస్తులు, ప్రైవేట్ సంస్థల్లో వారికి అధికారులతో అవగాహన కుదరదు. పాత మిత్రుల కలయికతో గతస్మృతులు జ్ఞప్తికి వస్తాయి. ప్రత్యర్థుల తీరును గమనించి తదనుగుణంగా మెలగండి.
 
మకరం: కొంతమంది మీ నుంచి ధనం లేకుంటే ఇతరత్రా సహాయం అర్థిస్తారు. అయినవారి నుంచి అభిమానాన్ని, ప్రేమను మరింత పొందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. 
 
కుంభం: దైవ దర్శనాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వైద్య, ఇంజనీరింగ్ రంగంలో వారికి మెళకువ అవసరం. సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. ఉద్యోగస్తుల ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు.
 
మీనం: మందులు, ఫ్యాన్సీ, వ్యాపారులకు కలిసివచ్చేకాలం. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండటం వల్ల పొదుపు సాధ్యం కాదు. సోదరీ, సోదరుల మధ్య ఆస్థి విషయాల గూర్తి తగాదాలు రావచ్చు. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments