Webdunia - Bharat's app for daily news and videos

Install App

17-08-2021 మంగళవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే...

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (04:00 IST)
మేషం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విదేశాల నుంచి ప్రత్యేక విషయాలు విని సంతోషిస్తారు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
వృషభం : కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. 
 
మిథునం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. క్రీడా కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పెద్దలతో సోదరీ, సోదరుల విషయాలు చర్చకు వస్తాయి. సంఘంలో మంచి పేరు ఖ్యాతి లభిస్తుంది. 
 
కర్కాటకం : కుటుంబ పరిస్థితులు క్రమేణా మెరుగుపడతాయి. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తారు. వాహన చోదకులకు ఏకాగ్రత అవసరం. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. 
 
సింహం : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిదని గమనించండి. సేవా సంస్థలకు విరాళాలివ్వడం వల్ల మీ కీర్తి ప్రతష్టలు ఇనుమడిస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ముఖ్యుల ఆరోగ్యం మిమ్మల్ని నిరాశపరుస్తుంది. 
 
కన్య : ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. మీ నిర్లక్ష్యం వల్ల గృహములో విలువైన వస్తువులు చేజారిపోతాయి. జాగ్రత్త వహించండి. ముందు చూపుతో వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ఏదైనా అమ్మకానికడ చేయు యత్నాలు వాయిదాపడగలవు. 
 
తుల : ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి కానవస్తుంది. 
 
వృశ్చికం : మిత్రుల కలయికతో ప్రశాంతతను పొందుతారు. ఉద్యోగపరంగా మంచి పేరును సంపాదిస్తారు. స్థిరాస్తిని అమ్మే విషయంలో పునరాలోచన అవసరం. దేవాలయాలను సందర్శనం చేసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. 
 
ధనస్సు : ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు. మీ కళత్ర మొండివైఖరి మీకెంతే చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు ఇరుగుపొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. బ్యాంకు పనుల్లో అనుకూలిస్తాయి. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తలెత్తుతాయి. 
 
మకరం : మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండటం మంచిది. విదేశీయాన ప్రయాణాలు వాయిదాపడతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
కుంభం : మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు అవసరం. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా అయినా పూర్తి కాగలవు. రవాణా రంగాలవారికి ఇబ్బందులు తప్పవు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. 
 
మీనం : బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను అధికంగా ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలు, నూతన ప్రదేశాల సందర్శనలకు ప్రణాళికలు రూపొందిస్తారు. అనుకున్నవి సాధించే విషయంలో రాజీపడొద్దు. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

Finland woman Raita: ఫిన్‌లాండ్ మహిళ నోట గబ్బర్ సింగ్ పాట.. పవన్ గురించి బాగా తెలుసు (video)

Allu Arjun Issue: చంద్రబాబు సైలెంట్‌.. పవన్ చెప్పడంతో?

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments