Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

13-08-2021 శుక్రవారం దినఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించినా...

13-08-2021 శుక్రవారం దినఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించినా...
, శుక్రవారం, 13 ఆగస్టు 2021 (04:00 IST)
మేషం : వ్యాపారాలలో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని లాభాల బాటలో నడిపిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు సామాన్యమైన లాభాలనే ఇస్తాయి. ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
వృషభం : కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. పెద్దల గురించి అప్రియమైన వార్తలు వినవలసివస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. భూ వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. స్త్రీలకు వస్త్ర, వస్తులాభం ఉంటాయి. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. 
 
మిథునం : మిత్రులు సహకారంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. గృహ నిర్మాణం, మరమ్మతులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మీ మాటకు సంఘంలో గౌరవం లభిస్తుంది. 
 
కర్కాటకం : సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఖర్చులు పెరగడంతో రుణాలు, చేబదుళ్లు తప్పవు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. చిట్స్ ఫైనాన్స్ రంగాల వారికి ఖాతాదారుల నుంచి చికాకులు ఎదురవుతాయి. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 
 
సింహం : ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. విద్యార్థులకు ఒత్తిడి, మానసికాందోళన తప్పవు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయంలో ఏకాగ్రత, పునరాలోచన ముఖ్యం. 
 
కన్య : నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు సంతృప్తి. పురోభివృద్ధి కానవస్తుంది. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోయి సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. 
 
తుల : వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. స్త్రీలకు ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. రుణయత్నాలు అనుకూలిస్తాయి. అవివాహితులకు శుభవార్తల అందుతాయి. 
 
వృశ్చికం : కొంతమంది మీ నుంచి ధనసహాయం లేక ఇతరాత్రా సాయం అర్థిస్తారు. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన అవసరం. అన్ని వ్యవహారాల్లో జయం లభిస్తుంది. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ వంటి శుభపరిణామాలు ఉంటాయి. 
 
ధనస్సు : స్త్రీలు దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ అవసరం. స్త్రీలకు అని విధాలా శుభదాయకం. గృహంలో మార్పులు వాయిదాపడతాయి. అవివాహితులకు అనుకున్న సంబంధాలు నిశ్చయం కావడంతో వారిలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. 
 
మకరం : మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. చేతి వృత్తుల వారికి శ్రమాధిక్యత, ఒత్తిడి అధికమవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యల్లో ప్రవేశం లభిస్తుంది. పెరిగిన ఖర్చులు, ఇతరాత్రా అవసరాలు మీ ఆర్థిక స్థితికి అవరోధంగా నిలుస్తాయి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. 
 
కుంభం : మీ దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. ఉద్యోగస్తులకు ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. ప్రేమికుల తొందరపాటుతనం సమస్యలకు దారితీస్తుంది. ఖర్చులు ఆదాయానికి తగినట్టుగా ఉంటాయి. విద్యార్థులు సామాన్యంగా ఫలితాలను సాధిస్తారు. మీ మాటకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
మీనం : ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలు వాగ్విదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. రావలసిన ధనం అందడంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. మీ కార్యక్రమాలు, వనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-08-2021 గురువారం దినఫలాలు - సుబ్రహ్మణ్య స్వామిని పూజించినా జయం