Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరింటాకు మరకలు పోవాలంటే..?

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (14:24 IST)
సాధారణంగా మహిళలు రాత్రివేళ అరచేతులకు గోరింటాకు పెట్టుకుంటుంటారు. ఇలా పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో బట్టలకు, బెడ్‌షీట్లకు గోరింటాకు మరకలు పడుతుంటాయి. వీటిని తొలగించేందుకు నానా తిప్పలు పడుతుంటారు. 
 
ఇలా పడిన గోరింటాకు మరకలు పోవడానికి మరకంటిన ప్రదేశాన్ని అరగంటసేపు పాలలో నానెయ్యాలి. తర్వాత శుభ్రం చేస్తే అదే పోతుంది. పాలతో వీలుపడని పక్షంలో నిమ్మకాయ ముక్కతో రుద్దిచూస్తే గోరింటాకు మరకలు పోతాయి. 
 
అలానే, జేబు రుమాళ్ళపైన, టవల్స్‌ మీద పడే లిప్‌స్టిక్‌ మరకలు పోవాలంటే వాటిపై గ్లిజరిన్‌ రాసి కాసేపటి తర్వాత సబ్బుతో ఉతికితే మంచి ఫలితం ఉంటుంది. శీకాయపొడితో రుద్దితే జరీమీద పడిన మరకలు పోతాయి. 
 
దుస్తుల మీద పడిన టీ మరకలు పోవాలంటే ఓ టమాటా ముక్కను మరక మీద రుద్ది తర్వాత సబ్బుతో ఉతికితే మరకపోతుంది. విద్యార్థుల దుస్తులపై పడిన సిరా మరకలు పోవాలంటే పుల్లటి పెరుగులో కాసేపు నానబెట్టి తర్వాత ఉతికితే సిరా మరక కనిపించదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన- కోటి దీపోత్సవానికి హాజరు

యాంటీబయాటిక్స్‌ విషయంలో ఈ పొరపాట్లు చేయొద్దు

సజ్జల భార్గవ్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయాలి: వైఎస్ షర్మిల

కొత్త మెనూని పరిచయం చేసిన హైదరాబాద్ బౌగెన్‌విల్లా రెస్టారెంట్

మరో 10 ఏళ్లు సీఎంగా చంద్రబాబు వుండాలి: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

లక్ష రూపాయలు గెలుచుకోండంటూ డియర్ కృష్ణ వినూత్న కాంటెస్ట్

మూడు భాషల్లో ఫుట్ బాల్ ప్రేమికుల కథ డ్యూడ్

తర్వాతి కథనం
Show comments