కావలసిన పదార్థాలు:
ఇన్‌స్టంట్ కాఫీ పొడి - 1 స్పూన్
గోరువెచ్చని నీరు - పావుకప్పు
చక్కెర - 4 స్పూన్స్
వెన్నతీయని పాలు - 2 కప్పులు
ఐస్‌క్యూబ్స్ - 8.
తయారీ విధానం: ముందుగా బ్లెండర్‌లో ఇన్‌స్టంట్ కాఫీ పొడి, పంచదార, గోరువెచ్చని నీళ్లుపోసి బాగా కలుపుకోవాలి. మిల్క్‌షేక్ కోసం ఫుల్‌క్రీమ్ పాలు వాడారు. వెన్న తీసిన పాలు, తక్కువ కొవ్వు ఉన్న పాలు కూడా వాడొచ్చు. ఒకవేళ ఇవి వాడుతుంటే పావుకప్పు నీళ్లకు బదులు 2 లేదా 3 స్పూన్ల నీళ్లు పోస్తే సరిపోతుంది. ఇప్పుడు అన్నింటినీ వేశాక నిమిషం పాటు బ్లెండ్ చేయాలి.
కాఫీ నురుగు వచ్చే వరకు లేదా మిశ్రమం లేతరంగుకు వచ్చేవరకు బ్లెండ్ చేయాలి. ఐస్‌క్యూబ్స్ వేసుకోవాలి. తరువాత చల్లని పాలను పోసి బాగా కలుపుకుని మళ్లీ ఓసారి బ్లెండ్ చేయాలి. అంతే కాఫీ మిల్క్ షేక్ రెడీ.