కావలసిన పదార్థాలు:
టమోటాలు - 10
చక్కెర - 1 కప్పు
నెయ్యి - అరకప్పు
బొంబాయి రవ్వ - 1 కప్పు
జీడిపప్పు, బాదం పప్పులు - 2 స్పూన్స్
యాలకుల పొడి - అరస్పూన్.
తయారీ విధానం:
ముందుగా టమోటాలను నీళ్ళల్లో ఉడికించి చల్లార్చాలి. ఆపై వాటి గుజ్జును తీసి బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి జీడిపప్పు, బాదం పప్పు, బొంబాయి రవ్వలను విడివిడిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద కాస్త లోతుగా ఉన్న పాత్రని పెట్టి అందులో 2 కప్పుల నీరు పోసి మరిగించి ఆపై బొంబాయి రవ్వ వేసి కలుపుతూ ఉండాలి. రవ్వ చిక్కబడుతున్న సమయంలో టమోటా గుజ్జు, చక్కెర, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత బాదం పప్పు, జీడిపప్పు కూడా వేయాలి. మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో యాలకుల పొడి చల్లి దించేయాలి. తరువాత ప్లేట్ అడుగుకు కొద్దిగా నెయ్యి రాసి హల్వాని ప్లేటులో వేసి నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే టమోటా హల్వా రెడీ.