Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందంగా కనిపించాలంటే.. ఏం చేయాలి..?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (14:28 IST)
నేటి తరుణంలో చాలామంది మహిళలు అందాన్ని కోల్పోతున్నారని చాలా బాధపడుతుంటారు. దాంతో పలురకాల డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. బయటదొరికే కెమికల్స్ క్రీమ్స్, ఫేస్‌ప్యాక్ ఎక్కువగా వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి తేడా కనిపించక.. విసురు చెంది.. ఏం చేయాలో తెలియక తికమకపడుతుంటారు. వీటన్నింటిని ఈ చిట్కాలు పాటిస్తే చాలు.. అవేంటో చూద్దాం...
 
మినపప్పు అరకిలో, తులసీ ఆకులు 50 గ్రా, వేపాకులు 5 గ్రా తీసుకొని వీటిని నీడలో ఎండబెట్టాలి. అనంతరం ఈ మూడింటిని బాగా గ్రైండ్ చేయాలి. ఒక పాత్రలో ఈ మిశ్రమాన్ని రెండు స్పూన్స్ తీసుకుని అందులో 2 చుక్కలు నిమ్మరసం చేర్చి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇది వారానికి ఒక్కసారి చేస్తే చాలు.. మీ ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
 
అందాన్ని కాపాడే ముఖ్యమైన పదార్థం మినపప్పు. నిర్జీవంగా కనిపించే చర్మానికి యౌవనాన్ని ఇచ్చేదే మినపప్పు. 2 స్పూన్స్ మినపప్పు పొడిలో కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ప్యాక్ ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేస్తే ముఖం మృదువుగా, అందంగా ఉంటుంది. అదేవిధంగా స్నానం చేసేటప్పుడు మినపప్పు మిశ్రమాన్ని చర్మానికి రాసి స్నానం చేస్తే చర్మం యౌవన్నంగా కనిపిస్తుంది.
 
మినపప్పు పొడి స్పూన్, మిరియాల గింజ ఒకటి తీసుకోని స్పూన్ పాలలో ఊరబెట్టాలి. దీంతో పాటు కాల్ స్పూన్ ముల్తానీ మట్టిని చేర్చి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ముఖంపై గల మెుటిమలు, మచ్చలు క్రమంగా మటుమాయం అయిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments