Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జిడ్డు చర్మాన్ని తొలగించాలంటే.. ఇలా చేయాలి..?

జిడ్డు చర్మాన్ని తొలగించాలంటే.. ఇలా చేయాలి..?
, సోమవారం, 17 డిశెంబరు 2018 (12:27 IST)
చలికాలంలో చర్మం పలురకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖచర్మం పొడిబారుతుంటుంది. దాంతో వదిలేయక వెంట్రుకలు కూడా ఎక్కువగా రాలిపోతుంటారు. శిరోజాల ప్రభావం కారణంగా ముఖంపై మచ్చలు ఏర్పడుతుంటాయి. వీటితో పాటు చర్మం కాంతిహీనమై నిర్జీవంగా కనిపిస్తుంది. కోల్పోయిన అందాన్ని తిరిగి పొందాలంటే.. ఇంట్లోని పదార్థాలు ఉపయోగిస్తే చాలంటున్నారు బ్యూటీ నిపుణులు.. మరి అవేంటో తెలుసుకుందాం...
   
 
జిడ్డు చర్మం గలవారు మినపప్పుతో పాటు పెరుగు కలిపిన మిశ్రమాన్ని ఫేషియల్‌లా వేసుకుంటే జిడ్డు తొలగి ముఖం అందంగా మారిపోతుంది. ఒక పాత్రలో మినపప్పు మిశ్రమాన్ని తీసుకొని అందులో కాస్త పెరుగు, నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. ఇలా చేస్తే జిడ్డు తగ్గి ముఖం అందంగా మారుతుంది. 
 
2 స్పూన్ల మినపప్పు పొడితో 4 స్పూన్ల పాలు, 2 స్పూన్ల రోజ్‌వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరచాలి. ఇలా వారంలో మూడుసార్లు చేసినట్లైతే చర్మంలోని జిడ్డు తొలగి అందమైన, ఆకర్షణమైన ముఖం మీ సొంతం అవుతుంది. 
 
పూర్వ కాలం నుంచి నేటి వరకు సాంప్రదాయబద్దంగా ఉపయోగించే పదార్థం మినపప్పు, పసుపు. ఇవి రెండు శరీర ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి అందాన్ని చేకూర్చేవి. ఒక పాత్రలో రెండు స్పూన్ల మినపప్పు పొడి చిటికెడు పసుపు, కాస్త నీరు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసిన అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరచినట్లైతే చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృంగారంలో స్త్రీపై మగాడు ఆసక్తిని కోల్పవడానికి కారణం?