Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భం రావాలంటే ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (23:54 IST)
గర్భం రావాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కలవాలి? ఇది ఇంకొందరి ప్రశ్న. వీటన్నింటికి ఒక్కటే సమాధానం గర్భధారణ గురించి తెలుసుకోవడమే. సాధారణంగా రుతు స్రావం జరుగుతున్న మహిళల్లో బహిష్టు అయిన 12 నుంచి 16 రోజుల లోపు అండం విడుదలతుంది. ఈ సమయంలో రతిలో పాల్గనడం వలన గర్భధారణ జరుగుతుంది.

 
వీర్యకణాలు, అండంతో కలసి పిండంగా మారుతాయి. దీనినే గర్భధారణ అని అంటారు. ఈ సమయంలో తప్ప మరెపుడు గర్భధారణ కాదా? అనే ప్రశ్న మళ్ళీ ఉత్పన్నమవుతుంది. కొందరిలో ముందుగా గర్భధారణ జరిగే అవకాశం ఉంది. ఇది చాలా తక్కువగా జరుగుతుంది. ఇలాంటి సంఘటనలలో 8 నుంచి 10 రోజుల లోపు అండం విడుదలవుతుంది. దీనిని ముందస్తు గర్భధారణ అంటారు. 

 
గర్భం ఎన్నాళ్ళుంటుంది ?
సాధారణంగా గర్భధారణ సమయం నుంచి ప్రసవించే వరకూ 40 వారాల (9 నెలల 10 రోజులు) కాలపరిమితిలో మహిళను గర్భవతి అంటారు. దీనిని మూడు దశలుగా విభజిస్తారు. మొదటి 12 వారాలను ఒకటోదశగానూ, 13-27 వారాలను రెండో దశగానూ, 28-40 వారాల కాలపరిమితిని మూడో దశగా పరిగణిస్తారు. 

 
పరీక్షలు చేయించుకోవాలా...? 
గర్భనిర్ధారణ అయిన తరువాత పరీక్షలు చేయించుకోవడం మంచిదే. రక్తహీనత, మూత్రపిండాలలో ఏవైనా లోపాలుంటే ఆ ప్రభావం పిండంపై పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో గర్భస్రావం జరగవచ్చు. కాబట్టి రక్త పరీక్ష, మూత్ర పరీక్షలు చేయించుకుని వైద్యుల వద్ద సలహాలు తీసుకోవాలి. గర్భసంరక్షణకు వైద్యులను తరచూ సంప్రదిస్తూ ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వాట్సాప్ గ్రూపుల ఏర్పాటు కూడా ర్యాగింగ్‌తో సమానం : యూజీసీ

హైదరాబాద్‌లో విషాదం.. కల్తీ కల్లు సేవించి 15 మందికి అస్వస్థత

ఇద్దరు భార్యలు కలిసి భర్తను చంపేశారు.. ఎందుకని?

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

తర్వాతి కథనం