Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ ఫోటోలు వైరల్: భారతీయుడు-2 అవుట్

Advertiesment
కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ ఫోటోలు వైరల్: భారతీయుడు-2 అవుట్
, సోమవారం, 3 జనవరి 2022 (10:39 IST)
Kajal_Gautam
హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో తల్లికాబోతోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్‌కు చెందిన ప‌లు ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఆమె గర్భిణీగా కనిపించడం ఇందుకు కారణం. ఆమె భర్త గౌతమ్‌ కిచ్లూ ఈ ఫొటోల‌ను పోస్ట్ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ గుడ్ న్యూస్ చెప్పారు. కాజ‌ల్ కూడా ఓ ఫొటో పోస్ట్ చేసింది.
 
ప్రెగ్నెంట్‌ లేడీ ఎమోజీని జోడిస్తూ గౌతమ్‌ కిచ్లూ ఫొటోల‌ను పోస్ట్ చేశారు. త‌ల్లిదండ్రులు కాబోతున్న‌ కాజల్‌, గౌతమ్‌ దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
 
ప్రస్తుతం కాజ‌ల్ ఆచార్య, భారతీయుడు-2 సినిమాల్లో న‌టిస్తోంది. అయితే, గ‌ర్భం దాల్చ‌డంతో భారతీయుడు-2 నుంచి ఆమె తప్పుకొన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త ఏడాది వివాహబంధంతో కాజ‌ల్‌, గౌత‌మ్ కిచ్లూ ఒక్క‌టైన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత మదర్‌కు సారీ చెప్పిన నాగ చైతన్య