Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భస్రావాలకు కారణాలు ఏమిటి?

Webdunia
మంగళవారం, 26 మే 2020 (21:00 IST)
చాలామంది గర్భిణులు అధిక ఒత్తిడితో వుండటం వల్ల అబార్షను ముప్పు కలుగుతోందంటున్నారు వైద్య నిపుణులు. అందుకే ఎల్లప్పుడూ గర్భిణులు ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండాలట. గర్భిణి కోపతాపాలకి లోనయితే గర్భస్థ శిశువు ఆరోగ్యం తారుమారు అవుతుందట.
 
గర్భస్థ శిశువు ఆరోగ్యమే కాదు గర్భిణీ ఆరోగ్యం కూడా పాడవుతుందట. మానసిక ఒత్తిడి వల్ల గర్భిణీలో బిపి, షుగర్‌లు తలెత్తుతాయట. గర్భిణీలోని బిపి, షుగరులు ఆమెకు ఎంతో హాని కలిగిస్తాయి. గర్భిణీలో కలిగే మానసిక ఒత్తిడి వల్ల మెడనొప్పులు, నడుం నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పులు కలుగుతాయట. నిరంతరం నీరసంగా ఉంటుందట. నిద్ర పట్టదట.
 
దీంతో ఆమె ఇబ్బందులు పాలవడమే కాకుండా గర్భస్థ శిశువు కూడా సమస్యలు తలెత్తుతాయి. గర్భిణీకి తగినంత నిద్ర అత్యంత అవసరం. నిద్ర లేకపోతే గర్భిణీలో రకరకాల అనారోగ్యాలు కలుగుతాయి. బాధలు కలుగుతాయి. గర్భిణీగా ఉన్నప్పుడు కలిగే ఆవేశాలు, కోపతాపాలు, చికాకులు, చిర్రుబుర్రులు గర్భస్రావానికి దారి తీస్తాయట.
 
ఒకవేళ గర్భం కొనసాగినా నెలలు నిండకుండా కాన్పు అయిపోయే ప్రమాదం ఉందట. తల్లి ఏడుస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే బిడ్డలో కూడా అలజడి కలుగుతుందట. దీనికి కారణం తల్లిలో నుంచి స్ట్రెస్ హార్మోన్లు బిడ్డకి చేరడమే. ఆ స్ట్రెస్ హార్మోస్లు బిడ్డలో కూడా మార్పులు తీసుకువస్తాయట. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments