ఆ బాలికకు నాలుగేళ్ల నుంచి లైంగిక వేధింపులు.. పదో తరగతి చదువుతుండగా మూడుసార్లు గర్భస్రావం జరిగింది. దీనికి కారణం మేనమామ. కానీ సంవత్సరాల పాటు లైంగిక దాడికి గురైన ఆమె 40 ఏళ్లలో కోర్టులో కేసు దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళ.. కోర్టులో తన మేనమామపై లైంగిక దాడి కేసు దాఖలు చేసింది.
అందులో 1981వ సంవత్సరంలో తనకు నాలుగేళ్లు. ఆ సమయంలో తొలిసారిగా తన మేనమామ ద్వారా తనకు లైంగిక వేధింపులు ప్రారంభమైనాయి. అంతేగాకుండా పదో తరగతి చదువుతుండగా మూడుసార్లు గర్భస్రావం జరిగిందని.. అప్పటివరకు లైంగిక వేధింపులు, దాడికి గురైనానని బాధితురాలు కోర్టుకు ఫిర్యాదు చేసింది.
గత 2014వ సంవత్సరం తనకు భర్తతో విడాకులు అయ్యాక ఈ వేధింపులు అధికమైనాయని.. ఇప్పటివరకు ఈ వేధింపులు ఆగలేదని కోర్టుకు సమర్పించిన ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారాన్ని కుటుంబీకులకు తెలియజేసినా.. ఫలితం లేదని వాపోయింది.