రోజుకు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీతో ఊపిరితిత్తులు క్లీన్

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (14:35 IST)
వాహనాలు పెరిగిపోవడం వల్ల గాలి కాలుష్యం తీవ్రంగా ఉంది. దాని వలన ప్రజలకు అనేక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులకు హాని కలుగుతుంది. పొగత్రాగడం, మద్యం సేవించడం వల్ల కూడా ఉపిరితిత్తులకు ప్రమాదం ఏర్పడుతోంది. దీర్ఘకాలిక వ్యాధులు కూడా మరొక కారణం. ఫలితంగా అది క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది. అయితే కింద చెప్పిన సూచనలు పాటిస్తే, ఊపిరితిత్తులను చాలా ఎఫెక్టివ్‌గా కేవలం 3 రోజుల్లో శుభ్రం చేసుకోవచ్చు.
 
పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ వంటి వాటిని తీసుకోకూడదు. వీటిల్లో ఉండే పలు రకాల పదార్థాలు ఊపిరితిత్తులకు హాని చేస్తాయి. వీటిని ఆహారం నుంచి తొలగించడం మంచిది. 
 
రోజుకు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ తాగాలి. దీంతో ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటికి వెళ్లిపోయి అవి శుభ్రంగా తయారవుతాయి. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగాలి. దీంతో ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.
 
ఉదయాన్నే పరగడుపున, మధ్యాహ్నం భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి.
 
నారింజ, అరటిపండు, చిలగడదుంపలు, క్యారెట్లు తదితర పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తింటే ఊపిరితిత్తులు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున అల్లం రసం సేవిస్తే ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. 
 
ఉదయాన్నే పరగడుపున 4,5 పుదీనా ఆకులను అలాగే నమిలి మింగాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి. కొంత ఆముదం తీసుకుని ఉదయం, సాయంత్రం చాతిపై మర్దనా చేస్తూ రాయాలి. దీంతో ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. అయితే ఈ సూచనలను పాటించాలనుకునే వారు పొగ తాగకూడదు, మద్యం సేవించకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దావోస్‌లో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం- బ్లైజ్

అటు ఫోన్ ట్యాపింగ్‌ - ఇటు లిక్కర్ స్కామ్.. జోరుగా విచారణలు

తెలంగాణలోని కొల్లాపూర్‌లో గ్రంథాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచిన డియాజియో ఇండియా

ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు

టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ ను అభినందించిన విజయ్ దేవరకొండ

Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్‌ టీజ‌ర్

Niharika Konidela: రాకాస గ్లింప్స్‌లో కామెడీ టైమింగ్‌తో మెప్పించిన సంగీత్ శోభన్

తర్వాతి కథనం
Show comments