నీటిని ఎక్కువగా తాగితే ఎంత మేలో తెలుసా?

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (12:28 IST)
శరీరంలో ఉండే అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఉన్నాయి. ఇవి రక్తంలోని మలినాలను తొలగించి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. ఇవి కూడా నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మలినాలు తొలగించే ప్రక్రియలో వీటిల్లో మలినాలు నిక్షిప్తమై రాళ్ళు, ట్యూమర్‌లు రావొచ్చు. అందుకే వీటిని తరచుగా డిటాక్స్ చేయడం మంచిది. సహజంగా కిడ్నీలను డిటాక్స్ చేయడం ఎలాగో చూద్దాం. 
 
నీళ్లు కిడ్నీలను సులభంగా శుభ్రం చేయగల సాధనం. కాబట్టి నీళ్లు ఎక్కువగా త్రాగాలి. రోజూ దాదాపు 8 నుండి 10 గ్లాసుల నీళ్లు త్రాగండి. ఇతర సమస్యలు ఏవీ లేకుంటే ఇంకా ఎక్కువ త్రాగవచ్చు. నీళ్లు టాక్సిక్ పదార్థాలను ఫిల్టర్ చేసినట్లుగా తీసివేస్తుంది. మీ మూత్రం క్లియర్‌గా ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటే మీరు తగినన్ని నీళ్లు త్రాగుతున్నారని అర్థం లేకపోతే మీరు మరిన్ని నీళ్లు త్రాగాలి.
 
తాజా పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజువారీగా తీసుకుంటూ ఉండండి. ద్రాక్ష, నారింజ, అరటిపండు, కివి, అప్రికాట్ లాంటి వాటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. పాలు, పెరుగులలో కూడా పుష్కలంగానే ఉంటాయి. ముఖ్యంగా వివిధ రకాల బెర్రీస్, ఎందుకంటే వీటిలో ఉండే క్వినైన్ మెటబాలిజంలో హిప్యురిక్ ఆసిడ్‌గా మారి కిడ్నీలను సమర్దవంతంగా శుభ్రం చేస్తుంది.
 
బార్లీ ధాన్యం కిడ్నీలను శుభ్రపరచడమే కాదు, ప్రమాదాల బారి నుండి కాపాడగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఫైబర్ ఎక్కువగా ఉండే ఒక హోల్ గ్రైన్. ఇది ఇంకా డయాబెటిస్ లాంటి వాటి నుండి కూడా సమర్థవంతంగా రక్షిస్తుంది. కొన్ని బార్లీ గింజలను రాత్రిళ్ళు నీళ్ళల్లో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం వల్ల బార్లీలోని మంచి గుణాలను పూర్తిగా స్వీకరించవచ్చు. 
 
ఆల్కహాల్, చాక్లేట్ మరియు కేఫ్ఫిన్‌లకు దూరంగా ఉండండి. వీటి వల్ల చాల దుష్ప్రభావాలు ఉన్నాయి, ఒక కిడ్నీల పైనే కాదు, మొత్తం ఆరోగ్యంపై కూడా వీటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వీటిని అరిగించే, కరిగించే క్రమంలో కిడ్నీలపై చాల ప్రభావం పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

తర్వాతి కథనం
Show comments