నిద్ర చాలడం లేదనే బెంగ ఎందుకు... ఇలా చేసి చూడండి...

బుధవారం, 28 ఆగస్టు 2019 (21:49 IST)
పరుగులుపెట్టే జీవితం అయిపోయింది నేటి ప్రపంచం. ఇదివరకు ఎనిమిది గంటల పాటు పనిచేసి సాయంత్రమయ్యేసరికి ఇంటికి వెళ్లి హాయిగా భోజనం చేసి 8 గంటలకల్లా నిద్రించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అందువల్ల మన లైఫ్ స్టయిల్‌కు తగినట్లు వేళ ప్రకారం నిద్రించడం మొదటి సూత్రం. నిద్రకు ఉపక్రమించేందుకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేళ తప్పవద్దు. సరైన నిద్రకు ఆహార నియమం కూడా ఎంతో అవసరం.
 
నిద్ర చెడగొట్టే పానీయాలను గానీ ఘన పదార్థాలను కానీ తీసుకోకూడదు. దీనివల్ల నిద్రకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. టీ, కాఫీలకు బదులుగా బాదం మిల్కు వంటివి తీసుకోవచ్చు. నిద్రించే ముందు గోరువెచ్చని పాలు గ్లాసుడు త్రాగితే మంచిది.
 
పగటిపూట ఎక్కువ సమయం నిద్రించకూడదు. అందువల్ల రాత్రివేళ నిద్రపట్టదు. నిద్రరాకుండా ఉంటే మీకు ప్రియమైన సంగీతాన్ని వింటూ నిద్రలోకి జారుకోండి. కొంతమంది నిద్రపట్టేందుకు నిద్రమాత్రలను ఆశ్రయిస్తుంటారు. ఈ అలవాటుకు స్వస్తి చెప్పాలి. నిద్రమాత్రలు అనారోగ్యాన్ని తెస్తాయి.
 
పదేపదే పడక స్థానాలను మార్చితే కొత్త ప్రదేశం వల్ల నిద్ర రాకపోవచ్చు. అదేవిధంగా టాయిలెట్ అవసరాలను తీర్చుకోకుండా పడకను చేరరాదని గుర్తుంచుకోండి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మహిళా మణులకు మోడీ సర్కార్ గుడ్‌న్యూస్.. ఒక ఒక్క రూపాయికే...