Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి పాలు తీసుకుంటే కీళ్లనొప్పులు వుండవండోయ్..

మూడు పదులు దాటిన వెంటనే మహిళల్లో క్యాల్షియం శాతం లోపిస్తుంది. క్యాల్షియం తగ్గడంతో కీళ్లనొప్పులు ఆవహిస్తాయి. అలాంటి సమయంలో కొబ్బరి పాలును డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆవు

Webdunia
సోమవారం, 23 జులై 2018 (12:54 IST)
మూడు పదులు దాటిన వెంటనే మహిళల్లో క్యాల్షియం శాతం లోపిస్తుంది. క్యాల్షియం తగ్గడంతో కీళ్లనొప్పులు ఆవహిస్తాయి. అలాంటి సమయంలో కొబ్బరి పాలును డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆవు పాలను రోజుకు రెండు పూటలా తీసుకోవాలని వారు సలహా ఇస్తున్నారు. అలాగే కొబ్బరి నుంచి తీసిన పాలను తీసుకుంటే కీళ్ల నొప్పులు అదుపులో వుంటాయి. 
 
కొబ్బరిని ముక్కలుగా కోసి మిక్సీలో వేసి చిక్కని పాలు తీస్తారు. వీటిని వంటకాల్లో వాడొచ్చు. ఈ పాలకు కాస్త పంచదార కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి. అలాగే ఎండిన సోయా బీన్స్‌ని నీళ్లల్లో నానబెట్టి పాలు తీస్తారు. లాక్టోజ్‌ పడనివాళ్లు దీన్ని ప్రయత్నించవచ్చు. ఈ పాలను తాగడం వల్ల రక్తనాళాలు బలపడతాయి. మెనోపాజ్‌ సమయంలో సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి. దీంట్లో శాచురేటెడ్‌ ఫ్యాట్‌, చక్కెరశాతం చాలా తక్కువగా ఉంటుంది. మాంసకృత్తులు అందుతాయి.
 
అదేవిధంగా బాదంపప్పుని నానబెట్టి పాలు తీయడం కూడా చాలా సులువు. వీటినుంచి తగినన్ని మాంసకృత్తులూ, యాంటీ ఆక్సిడెంట్‌లూ, విటమిన్‌-ఇ, ఇనుము, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ల వంటివెన్నో అందుతాయి. శరీరంలో వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఎముకలకు బలాన్నిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

తర్వాతి కథనం
Show comments