Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేబీకార్న్, క్యాప్సికమ్ శాండ్‌విచ్ ఎలా చేయాలో చూద్దాం.. (video)

ముందుగా స్టౌమీద బాణలి పెట్టి వేడయ్యాక అందులో మూడు స్పూన్ల నూనెను వేయాలి. నూనె వేడయ్యాక ఉల్లి తరుగులు చేర్చాలి. ఉల్లి తరుగులు వేసిన ఐదు నిమిషాలకే క్యాప్సికమ్ తరుగును చేర్చాలి. ఆనియన్, క్యాప్సికమ్‌ను బా

Webdunia
ఆదివారం, 22 జులై 2018 (12:05 IST)
శాండివిచ్ అంటే అందరికీ ఇష్టమే. ఈవినింగ్ స్నాక్‌గా అందరూ తీసుకునే శాండ్‌విచ్‌ను బేబీ కార్న్, క్యాప్సికమ్, ఆనియన్ వంటి పోషకాలను శరీరానికిచ్చే పదార్థాలతో ఎలా తయారు చేయాలో చూద్దాం.. క్యాప్సికమ్, ఆనియన్, బేబీకార్న్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. 
 
ఇక బేబీకార్న్, క్యాప్సికమ్, ఆనియన్ శాండివిచ్‌కు.. 
కావలసిన పదార్థాలు:
నూనె -  అర కప్పు
ఉప్పు - తగినంత 
చీజ్ - ఒక కప్పు 
కారం - తగినంత 
ఉడికించిన బేబీ కార్న్- ఒక కప్పు
కొత్తిమీర తరుగు - పావు కప్పు 
క్యాప్సికమ్ తరుగు - ఒక కప్పు   
ఉల్లి తరుగు - ఒక కప్పు 
బ్రెడ్ ముక్కలు - నాలుగు
 
ఎలా చేయాలంటే..
ముందుగా స్టౌమీద బాణలి పెట్టి వేడయ్యాక అందులో మూడు స్పూన్ల నూనెను వేయాలి. నూనె వేడయ్యాక ఉల్లి తరుగులు చేర్చాలి. ఉల్లి తరుగులు వేసిన ఐదు నిమిషాలకే క్యాప్సికమ్ తరుగును చేర్చాలి. ఆనియన్, క్యాప్సికమ్‌ను బాగా కలియబెట్టాలి. ఆపై ఓ కప్పు కారం చేర్చాలి. తర్వాత ఉప్పు చేర్చి బాగా మిశ్రమాన్ని మగ్గనివ్వాలి. ఆనియన్ బాగా వేగాక చీజ్ ముక్కలు కలుపుకోవాలి. అందులోనే బేబీకార్న్ పలుకులు చేర్చి మిశ్రమాన్ని కలియబెట్టాలి. చివర్లో కొత్తిమీరను చేర్చాలి. ఈ మిశ్రమాన్ని పక్కనబెట్టుకుని.. బాణలిలో నూనె వేసి వేడయ్యాక బ్రెడ్ ముక్కలను ఇరు వైపులా దోరగా వేపుకుని ప్లేటులోకి తీసుకోవాలి.
 
ఆ బ్రెడ్ ముక్కలను ప్లేటులోకి తీసుకుని.. అంతకుముందు సిద్ధం చేసుకున్న బేబీకార్న్, క్యాప్సికమ్ మిశ్రమాన్ని స్పూన్‌లోకి తీసుకుని బ్రెడ్ ముక్కల మధ్య పరచాలి. ఆ మిశ్రమం చీజ్ ముక్కల్ని పేర్చి.. మరో బ్రెడ్ ముక్కతో మసాలాను బయటికి రాకుండా వుంచాలి. ఇలా సిద్ధం చేసుకున్న బ్రెడ్‌తో కూడిన మసాలాను బాణలిలో నూనె పోసి రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఇరు వైపులా దోరగా టోస్ట్ అయిన బ్రెడ్ ముక్కల్ని ప్లేటులోకి తీసుకుని హాట్ హాట్‌గా మీకు నచ్చిన సాస్‌తో సర్వ్ చేస్తే టేస్టు అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తర్వాతి కథనం
Show comments