Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ నాగుపాము.. పది ఉల్లిగడ్డలను మింగేసింది... తర్వాత ఏమైంది?

కొండ చిలువలు మనుషులనే మింగేస్తాయి. ఇటీవల కొండచిలువ పొట్ట నుంచి ఓ మహిళ మృతదేహాన్ని వెలికితీసిన సంగతి తెలిసిందే. అలాగే కేరళలోనూ ఓ పాము ఏడు గుడ్లను కక్కిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఒడిశాల

Advertiesment
ఆ నాగుపాము.. పది ఉల్లిగడ్డలను మింగేసింది... తర్వాత ఏమైంది?
, మంగళవారం, 3 జులై 2018 (11:46 IST)
కొండ చిలువలు మనుషులనే మింగేస్తాయి. ఇటీవల కొండచిలువ పొట్ట నుంచి ఓ మహిళ మృతదేహాన్ని వెలికితీసిన సంగతి తెలిసిందే. అలాగే  కేరళలోనూ ఓ పాము ఏడు గుడ్లను కక్కిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఒడిశాలో ఓ నాగుపాము ఉల్లిగడ్డల్ని మింగింది. ఆ తర్వాత వాటిని బయటకు కక్కేసింది. ఈ ఘటన అంగుల్ జిల్లాలోని చెండిపాడ గ్రామంలో జరిగింది. 
 
గ్రామంలోని ఓ ఇంట్లోకి చొరబడిన నాగుపాము ఒక కప్పతో పాటు 11 ఉల్లి గడ్డల్ని మింగేసింది. కానీ ఉల్లిగడ్డల్ని మింగడంతో పాము కదలలేని స్థితిలో వుండిపోయింది. దీన్ని గమనించిన ఆ ఇంటి యజమాని ఈ విషయాన్ని స్నేక్ హెల్ప్‌లైన్‌కు తెలియజేశాడు. 
 
దీంతో అక్కడకు చేరుకున్న హెల్ప్‌లైన్ వాలంటీర్ ఆ పామును పట్టుకున్నాడు. ఆ తర్వాత అది సడెన్‌గా ఉల్లిగడ్డలు కక్కడం మొదలుపెట్టింది. దీన్ని వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైను ముంచెత్తున్న భారీ వర్షాలు : అంథేరీలో కూలిన వంతెన