గన్నేరు, గరికతో వినాయకుడిని పూజిస్తే? గరికను బీరువాలో ఉంచితే?

ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభిస్తే తొలుత విఘ్నేశ్వరుడిని స్తుతించడం ఆనవాయితీ. సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కాలంటే తొలుత గణపతిని పూజించాలి. అలాంటి వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. గరికలో ఆరోగ్

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (14:29 IST)
ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభిస్తే తొలుత విఘ్నేశ్వరుడిని స్తుతించడం ఆనవాయితీ. సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కాలంటే తొలుత గణపతిని పూజించాలి. అలాంటి వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. గరికలో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా దాగివున్నాయి. దేవతా మూలికగా పేరున్న గరికలో తొమ్మిది రకాలున్నాయట. అందులో వినాయకుడి కోసం ఉపయోగించే గరిక ఎలా వుంటుందో అందరికీ తెలిసిందే. 
 
గరికతో పాటు, గన్నేరు పువ్వులతో వినాయక చతుర్థి రోజున వినాయకుడి పూజకు ఉపయోగించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. తెలుపు గన్నేరు పువ్వులతో ఉదయం పూట వినాయకుడికి, శివుడికి అర్చన చేయిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. అర్చక పుష్పం అని సంస్కృతంలో పిలువబడే గరిక ద్వారా విఘ్నేశ్వరుడిని పూజిస్తే సమస్త దోషాలు, విఘ్నాలు తొలగిపోతాయి. గరిక సూర్యునికి కూడా ప్రీతికరం కావడంతో ఆయన అనుగ్రహంతో ఆరోగ్యం ప్రాప్తిస్తుందని పండితులు చెప్తున్నారు.
 
అంతేకాకుండా.. గణనాధుడికి గరిక పూజ చేస్తే శనీశ్వరుడిచే కలిగే ఈతిబాధలు, సమస్యల నుంచి బయటపడతారు. శనిభగవానుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి. గరిక పత్రంతో శ్రీ మహా గణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి. అదీ వినాయక చతుర్థీ రోజున గరిక పూజతో విశిష్ట ఫలితాలను పొందవచ్చు. 
 
గరిక పత్రంతో వినాయకుడినే కాదు.. దుర్గాదేవిని పూజిస్తే ప్రార్థనలు ఫలిస్తాయి. ఈ పత్రాన్ని బీరువాల్లో, నగదు వుంచే ప్రాంతంలో వుంచితే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. రావలసిన ధనం చేతికి అందుతుంది. గరికమాలను విఘ్నేశ్వరునికి సమర్పించుకుని అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వినాయక చతుర్థీ రోజున 21 రకాల పత్రులతో పూజ చేసినా అన్నింటికంటే ముఖ్యమైనది. వినాయకుడికి ఎంతగానో నచ్చింది దూర్వార పత్రం. దాన్నే గరిక అంటారు. దీనితో పూజ చేసే వారికి గణపతి అనుగ్రహం లభిస్తుందని పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

అన్నీ చూడండి

లేటెస్ట్

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments