తిరుపతిలో ఆకట్టుకుంటున్న ప్రత్యేక హోదా వినాయకుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా వినాయకుడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. డి.ఆర్.మహల్‌ సమీపంలో ఈ ప్రత్యేక

బుధవారం, 7 సెప్టెంబరు 2016 (10:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా వినాయకుడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. డి.ఆర్.మహల్‌ సమీపంలో ఈ ప్రత్యేక హోదా వినాయకులను ఏర్పాటు చేశారు. 
 
పార్లమెంటులో సభ్యులందరూ ప్రత్యేక హోదాకు ఆమోదం తెలపాలంటూ ప్లకార్డులను చేతపట్టుకుని వున్న వినాయకులను ఏర్పాటు చేశారు. ఈ వైరైటీ వినాయకులను చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. 
 
మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అతిపెద్ద నారికేళ వినాయకున్ని ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ వినాయకున్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మితిమీరిన ఎండలో పని చేస్తే చర్మ కేన్సర్ తప్పదు : ఆస్ట్రేలియా ఉప ప్రధాని