Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మితిమీరిన ఎండలో పని చేస్తే చర్మ కేన్సర్ తప్పదు : ఆస్ట్రేలియా ఉప ప్రధాని

మితిమీరిన ఎండలో పని చేస్తే చర్మ కేన్సర్ తప్పదని ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి బార్నబీ జోయ్‌స్ అంటున్నారు. ప్రస్తుతం ఆయన చర్మ కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధిపై తన అనుభవాలను చెపుతూ ఎండలో పని చేస్తే చర

Advertiesment
Australian Deputy PM warns of skin cancer
, బుధవారం, 7 సెప్టెంబరు 2016 (10:26 IST)
మితిమీరిన ఎండలో పని చేస్తే చర్మ కేన్సర్ తప్పదని ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి బార్నబీ జోయ్‌స్ అంటున్నారు. ప్రస్తుతం ఆయన చర్మ కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధిపై తన అనుభవాలను చెపుతూ ఎండలో పని చేస్తే చర్మ కేన్సర్ ఖాయమని చెప్పడానికి తానో ఓ గొప్ప ఉదాహరణ అని అన్నారు. తన అనుభవాలు అనేక మందికి గుణపాఠమన్నారు. 
 
తాను చర్మ కేన్సర్‌తో బాధపడుతున్నట్టు చెప్పారు. ఈ వ్యాధిని నయం చేసుకొనేందుకు తాను చికిత్స పొందుతున్నాని చెప్పారు. ఎండ నుంచి కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తాను పాటించకపోవడం వల్ల దుష్ఫలితాలను తాను అనుభవిస్తున్నట్టు తెలిపారు. 
 
చికిత్స సందర్భంగా తన శరీరంపై ఏర్పడిన మచ్చలను ఆయన విలేకర్లకు చూపించారు. ఎండ వేడిని నిర్లక్ష్యం చేసి, పని చేసినందుకు మూల్యం చెల్లించుకుంటున్నానని చెప్పారు. నష్టాల గురించి ముందుగానే అవగాహన పెంచుకోవాలన్నారు. చిన్నటోపీ పెట్టుకొని పని చేస్తూ ఉంటారని, అది ఎండ నుంచి రక్షించదని వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికపై మూసివుంచిన రైస్ మిల్లులో రేప్ చేసిన యువకుడికి జైలు శిక్ష