Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఎంతో నేర్పింది.. సమిష్టి కృషి ఆకట్టుకుంది: కోహ్లీ

ఇంగ్లండ్‌తో సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు ద్వారా ఎంతో నేర్చుకున్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ఖాతాలో సరికొత్త రికార్డు సాధించింది.

Advertiesment
India Vs England: Kohli Unhappy With Amount of Grass on Rajkot Wicket
, సోమవారం, 14 నవంబరు 2016 (12:38 IST)
ఇంగ్లండ్‌తో సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు ద్వారా ఎంతో నేర్చుకున్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ఖాతాలో సరికొత్త రికార్డు సాధించింది. 114/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం చివరి రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. భారత్‌లో అత్యధిక ఓపెనింగ్  భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇప్పటిదాకా కోహ్లీ నేతృత్వంలో టీమిండియా 18 టెస్టులు ఆడగా, వాటిలో రెండింట మాత్రమే పరాజయం పాలైంది. 
 
అయితే ఇంగ్లండ్‌తో సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా రాజ్ కోట్‌లో జరిగిన తొలి టెస్టు ద్వారా ఒక అమూల్యమైన విషయాన్ని నేర్చుకున్నామని అంటున్నాడు కోహ్లి.  ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఎంతో నేర్పిందని.. జట్టు సమిష్టిగా రాణించిందని కోహ్లీ తెలిపాడు. మ్యాచ్ చివరి రోజు ఆటలో బంతి అనుకున్నదాని కంటే ఎక్కువ టర్న్ అవడమే కాకుండా, బాగా బౌన్స్ కూడా అయినట్లు కోహ్లి స్పష్టం చేశాడు. 
 
ఆ నేపథ్యంలోనే భారత్ తన రెండో ఇన్నింగ్స్ ఆదిలో కీలక వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడ్డామని కోహ్లీ తెలిపాడు. అయితే ఈ తరహాలో గేమ్‌ను రక్షించుకోవడం భారత్ జట్టుకు చాలా అరుదుగా మాత్రమే సంభవిస్తుందన్నాడు. కచ్చితంగా తొలి టెస్టు నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నామని, ప్రధానంగా గేమ్ ను ఎలా కాపాడుకోవాలో బాగా అర్థమైందని చెప్పుకొచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుట్టంరాజువారికండ్రిగకు వస్తోన్న సచిన్ టెండూల్కర్... ప్రజల సంబరాలు..