Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సొరకాయ కూర వెరైటీగా... తింటే ఎలా వుంటుందో తెలుసా?

Webdunia
సోమవారం, 29 జులై 2019 (15:37 IST)
సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిలో పోషకాలు ఎక్కువే.. అయితే దీనిని తినడానికి చాలామంది పిల్లలు అంతగా ఇష్టపడరు. సొరకాయను వెరైటీ రుచులలో వండితే చాలా ఇష్టంగా తింటారు. అదెలాగో చూద్దాం.
 
కావలసిన పదార్దాలు-
సొరకాయ- అరకిలో,
పచ్చిమిర్చి- అయిదు,
ఆవాలు- రెండు టీ స్పూన్లు,
కొబ్బరి తురుము-కప్పు,
బియ్యం- పావుకప్పు,
నువ్వులు- కప్పు,
కారం- ఒక టీస్పూను,
నూనె- తగినంత,
ఉప్పు- సరిపడా.
 
సొరకాయ తొక్కు తీసి ముక్కలుగా కోయాలి. పచ్చి వాసన పోయే వరకు ముక్కల్ని ఉడికించి దించి నీళ్లు వంపేయాలి. తరువాత బియ్యం, నువ్వులు విడివిడిగా ఒక గంట చొప్పున నానబెట్టాలి. తరువాత ఈ రెండింటిని రెండు టీస్పూన్ల ఆవాలు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు చేర్చి రుబ్బాలి.

బాణాలిలో నూనె వేసి కొద్దిగా ఆవాలు వేసిన తరువాత సొరకాయ ముక్కలు వేసి పది నిమిషములు వేయించాలి. తరువాత బియ్యం, నువ్వులు అన్ని కలిపి రుబ్బిన మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ఒక స్పూను కారం వేసి మూత పెట్టి పది నిమిషములు సన్నని సెగపై ఉంచి చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లాలి. అంతే... ఎంతో రుచిగా ఉండే ఆనపకాయ ఆవకూర రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భువనేశ్వర్‌: నాలుగేళ్ల బాలికను.. రూ.40వేలకు అమ్మేశారు.. ఎందుకంటే?

రఘురామకృష్ణంరాజు కేసు.. రిటైర్డ్ సీఐడీ ఏఎస్పీ అరెస్ట్.. ఇవన్నీ జరిగాయా?

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments