Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్నీర్ మిర్చీకా కుర్మా తయారీ..

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (11:17 IST)
పన్నీర్ పాల ఉత్పత్తులతో తయారుచేస్తారు. పన్నీర్‌లో క్యాల్షియం, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు ఆరోగ్యానికి చాలా మంచివి. మధుమేహ వ్యాధి గలవారు ప్రతిరోజూ పన్నీర్ తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. దాంతో పాటు పన్నీర్‌లోని క్యాల్షియం పళ్లు, ఎముకలను బలంగా చేస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
   
 
పన్నీర్‌ని చీజ్ అని కూడా అంటారు. ఈ పన్నీర్ అధిక బరువును కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ వ్యాధిగలవారు పన్నీర్ తరచుగా ఆహారంలో చేర్చుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. తద్వారా వ్యాధి అదుపులో ఉంటుంది. ఇటువంటి పన్నీర్‌తో మిర్చీ కుర్మా ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
పన్నీర్ - 250 గ్రాములు
పచ్చిమిర్చి - 25 గ్రాములు
టమాటాలు - 100 గ్రా
జీడిపప్పు - 25 గ్రా
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి - 5 గ్రా
పసుపు, ఉప్పు - తగినంతా
నూనె - సరిపడా
ధనియాల పొడి - 1 స్పూన్
జీలకర్రపొడి - 1 స్పూన్
వెన్న - 1 స్పూన్
క్రీమ్ - 1 గ్రా
నిమ్మరసం - 2 స్పూన్స్
 
తయారీ విధానం:
ముందుగా జీడిపప్పులను గంటపాటు నానబెట్టి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు టామోటా, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేయాలి. బాణలిలో నూనెను వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా వేయించి ముందుగా తయారుచేసుకున్న జీడిపప్పు పేస్ట్, టమోటా పేస్ట్, ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత జీలకర్రపొడి, ధనియాలపొడి వేసి కొన్ని నీళ్లు పోసి పన్నీర్, వెన్న, క్రీమ్ వేసి మరో 10 నిమిషాల పాటు ఉడికించి చివరగా నిమ్మరసం వేసి దించేయాలి. అంతే పన్నీర్ మిర్చీకా కుర్మా రెడీ. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments