లవ్ లెటర్సెందుకురా పురాతన ప్రేమికుడా?

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (19:02 IST)
ప్రియురాలికి ప్రియుడు రాసే అక్షరాలు.. చెలికి వెండివెన్నెల అందాలు... ఆ ప్రేమాక్షరాలు మరువలేని, మరపురాని, మత్తెక్కించి, మైమరిపించి, మరో లోకంలో విహరింపజేసే ప్రేమలేఖలోని ప్రణయాక్షరాలు. 
 
రెండు మనసులు... అయినా భావనలు ఒకటే
రెండు హృదయాలు... అయినా ప్రేమాక్షరాల స్పందన ఒకటే
ఇలా ఇరు ప్రేమ స్పందనలను పొదివి పట్టుకుని తన హృదయంలో దాచుకుని ఇష్ట సఖుడు/సఖి ముందు ఆవిష్కరించే ఆ ప్రేమ లేఖలు... ఇప్పుడు ఉన్నాయా?
 
ఎన్నాళ్లు... ఎన్నేళ్లు గడిచినా చెరగని ముద్రలా, నిలువెత్తు సాక్ష్యంలా నిలిచిన ఆ ప్రణయ లేఖలు నేడూ ఊసులాడుకుంటున్నాయా...? 
ఇలా కవితాత్మక ధోరణితో ఓ ప్రేమలేఖ ప్రియుడు ప్రశ్నాస్త్రాలను సంధిస్తే...
 
లవ్ వాయిస్ మెయిళ్లుండగా... ప్రేమ లేఖలెందుకురా ప్రియుడా
"హలో లవ్" అంటూ సెల్ "సై" అంటుంటే... లవ్ లెటర్సెందుకురా పురాతన ప్రేమికుడా
నెట్ ఉందీ.. పబ్ ఉందీ... డిస్కో థెక్ ఉందీ... ఇవి చాలక.... ఇంకెందుకురా పాతబడిన ప్రేమ లేఖల గొడవ
 
ప్రేమలేఖలు పట్టుకుని "మై స్వీట్ మెమెరీస్" అంటే అది పాతచింతకాయ ప్రేమ పచ్చడి.
పబ్బుల్లో ఊసులాడుతూ మబ్బుల్లో విహరించడం నేటి ఆధునిక "లవ్" పద్ధతి
ఇంకా అడుగాలనుందా నీ పూర్ ప్రేమ లేఖల గురించీ...
 
అంతే !! ఆ పురాతన ప్రేమికుడు మళ్లీ మాట్లాడితే ఒట్టు. ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇక చాలే అని గప్‌చిప్. అంతే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలోని మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం.. శ్రీ భరత్

చనిపోయిన వ్యక్తి ప్రాణాలతో తిరిగి వచ్చాడు.. ఎలాగో తెలుసా?

Ebola Advisory: ఎబోలా ప్రభావిత దేశాల ప్రయాణీకులు.. భారత్ ఆరోగ్య సలహాలు జారీ

నరమేథం సృష్టించే దేశం మాకు నీతులు చెబుతుందా? భారత్

ఆరు దశాబ్దాల తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో చేరిన కాంగ్రెస్ - విజయ్ కేబిటెన్‌లో మంత్రిపదవులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నా స్మృతివనం శంకుస్థాపన చేయి అంటూ భావోద్వేగానికి గురయిన నాగబాబు

manchu manoj: డేవిడ్ రెడ్డి కాదు రాక్షస రెడ్డి అన్న బ్రిటీషర్స్ ఎందుకంటే...

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టైలిష్ థ్రిల్లింగ్ మూవీగా ఐ యామ్ గేమ్

Mega brothers: మెగా బ్రదర్స్ కలయికగా చిరంజీవి మెగా158 సినిమా ప్రారంభోత్సవం

'మెగా 158' ప్రారంభం... అన్న సినిమాకు క్లాప్ కొట్టిన తమ్ముడు

తర్వాతి కథనం
Show comments