Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదాయపన్ను చెల్లించే వారికి శుభవార్త! ఈసారి రూ.80వేల వరకు లబ్ధి..!

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (09:41 IST)
ఆదాయపన్ను చెల్లించే వారికి శుభవార్త! పన్ను చెల్లింపు దారునికి లబ్ధి చేకూరే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గానూ బడ్జెట్‌లో కసరత్తులు చేస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.

గత బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను శ్లాబ్‌లను తీసుకువచ్చిన కేంద్రం..ఇప్పుడు పన్ను విధించే ఆదాయ పరిధిని పెంచేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.

అదే కనుక కార్యరూపం దాలిస్తే.. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు చెల్లించాల్సిన నగదులో రూ.50,000-రూ.80,000 వరకు లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఆర్థిక శాఖలో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

అయితే ఫిక్కి ప్రతినిధి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రభుత్వం స్టాండర్డ్‌ డిడక్షన్‌ను ఈ ఏడాది సుమారు రూ.లక్ష వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా వర్క్‌ఫ్రం హోం కారణంగా చాలా మంది ఉద్యోగులు ఇంట్లో ఆఫీస్‌ ఏర్పాటు చేసుకొన్నారు.

ఇందుకు కొంత మొత్తం ఖర్చయింది. ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇలాంటి ప్రతిపాదన చేయవచ్చని పేర్కొన్నారు. కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ (సీఐఐ) కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దఅష్టిలో పెట్టుకొని స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంచాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments