Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేతన జీవులకు శుభవార్త సరే.. ఆ మెలిక ఏంటి?

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (16:28 IST)
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ (2020-21)లో వేతన జీవులకు శుభవార్త చెప్పారు. కానీ, ఓ మెలిక పెట్టారు. దీంతో ఉద్యోగస్తులు విస్తుపోయారు. ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్ను శ్లాబులు కావాలంటే ఇప్పటివరకు అనుభవిస్తూ వస్తున్న పన్ను రిబేట్లను వదులుకోవాల్సి ఉంటుందన్న మెలికపెట్టారు. అంటే, ఇప్పుడు పన్ను తగ్గింపు కావాలా..? 80-సీ కింద వచ్చే రిబేట్లు కావాలా అన్నది ఉద్యోగుల నిర్ణయానికే వదిలివేశారు. కొత్త ట్యాక్స్ శ్లాబ్ కావాలంటే పాత శ్లాబ్ విధానం కింద పొదుతున్న టాక్స్ రిబేట్లను వదులుకోవాల్సివుంటుంది. 
 
కాగా, వేతన జీవులు, చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఐదు లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపునిస్తున్నట్టు ప్రకటించారు. ఆమె శనివారం లోక్‌సభలో 2020-21 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
అలాగే, ఐదు నుంచి 7.5 లక్షల రూపాయల ఆదాయం ఉంటే పది శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం వుంటే 15 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి రూ.12.50 లక్షల ఆదాయం వరకు 20 శాతం పన్ను, 15 లక్షల రూపాయలకు పైగా ఆదాయం ఉన్నవారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆమె ప్రకటించారు. 
 
ఆదాయపన్ను వివరాలను 
రూ.5 లక్షల వరకు.. పన్ను లేదు 
రూ.5 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు 10 శాతం పన్ను 
రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15 శాతం పన్ను
రూ.10 లక్షల నుంచి రూ.12.50 లక్షల వరకు 20 శాతం పన్ను
రూ.12.50 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం పన్ను
రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments