Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ 2020 : రైతన్నకు బాసట... 16 సూత్రాల పథకం

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (12:26 IST)
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2020-21 వార్షిక బడ్జెట్‌లో రైతన్నపై వరాల జల్లు కురిపించారు. రైతులు, వ్యవసాయ రంగ అభివృద్ధికి 16 సూత్రాల పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. 
 
ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగంలో సంపదను సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 6.11 కోట్ల మంది రైతులకు బీమా కల్పిస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. జీడీపీలో రుణాల శాతం 48.7 తగ్గిందన్నారు. అలాగే నీటి లభ్యత లేని 100 జిల్లాలను గుర్తించడం జరిగిందన్నారు. 2020, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 20-21ను ప్రవేశపెట్టారు. 
 
ఆరు లక్షలకు పైగా రైతులు ఫసల్ బీమా యోజనతో లబ్ది పొందుతున్నట్లు, కృషి సంచాయ్ యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. మొదటి ప్రాధాన్యాశంగా వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, రెండోది ఆరోగ్యం, పారిశుధ్యం, తాగునీరు, మూడోది విద్య, చిన్నారుల సంక్షేమం, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడంపై తాము దృష్టి సారించామన్నారు. 
 
రైతులకు సోలార్ పంప్ సెట్ల పథకాన్ని మరో 20 లక్షల మంది రైతులకు విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. సాగులేని భూముల్లో సోలార్ కేంద్రాలను ఉపయోగించడం వల్ల రైతులకు ఆదాయం వస్తుందన్నారు. నాబార్డు ద్వారా ఎస్ఎస్‌జీలకు సాయం అందిస్తామని, కూరగాయల సరఫరాకు కృషి ఉడాన్ యోజన, వర్షా భావా జిల్లాలకు అదనంగా నిధులు ఇస్తామన్నారు. 
 
రైతులకు సహాయంగా గిడ్డంగుల నిర్మాణం, గిడ్డంగుల నిర్మాణానికి నాబార్డు ద్వారా సహయం అందిస్తామన్నారు. పీపీపీ పద్ధతిలో ఎఫ్‌సీఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా గిడ్డంగుల నిర్మాణం, మహిళా స్వయం సహాయ సంఘాల ద్వారా ధాన్యలక్ష్మి పథకం అమలు చేస్తామని విత్తమంత్రి నిర్మలా సీతారమన్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments