జనసేన ఆఫీసులకి టు-లెట్ బోర్డులు... పవన్ కళ్యాణ్ ఏమన్నారు?

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (16:14 IST)
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసింది. ఐతే చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయిందని అటు తెదేపా ఇటు వైకాపా జనసేన శక్తిపై సెటైర్లు విసురుతున్నారు. ఇక వైకాపాకి చెందిన కొందరు నాయకులైతో ఓ అడుగు ముందుకు వేసి జనసేన పార్టీ కార్యాలయాలకు అక్కడక్కడా టు-లెట్ బోర్డులు కనిపిస్తున్నాయంటూ హీట్ ఎక్కించేశారు. ఈ వార్తలు ఇప్పుడు పలు టీవీ ఛానెళ్లలో కూడా దర్శనమిస్తున్నాయి. 
 
ఈ వార్తలు జనసేన పార్టీ చీఫ్ దృష్టికి వెళ్లినట్లున్నాయి. హుటాహుటిన పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడే మనం తొలి అడుగు వేశాం. కొంతమంది పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని పట్టించుకోకండి. జనసేన నియోజకవర్గాల్లోని కార్యాలయాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. 
 
సీట్లు ఎన్ని వచ్చాయన్నది తర్వాత చూద్దాం... మన ధ్యేయం ప్రజాసేవ చేయడమే. క్షేత్రస్థాయిలోకి వెళ్లి గ్రామాల్లో పర్యటించండి. ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో జనసేన ఎప్పుడూ ముందు వుంటుందని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments