Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో వెలుగు చూసింది ఎక్స్ఈ వేరియంట్ కాదు : కేంద్రం

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (10:45 IST)
మహారాష్ట్రలోని ముంబైలో వెలుగు చూసిన కరోనా వైరస్ ఎక్స్ఈ వేరియంట్ కాదని కేంద్రం స్పష్టం చేసింది. కానీ, ముంబైలో వెలుగు చూసింది ఎక్స్ఈ వేరియంటేనని ముంబై మున్సిపాలిటీ అధికారులు అంటున్నారు. కానీ, కేంద్య శాఖ అధికారులు మాత్రం అందుకున్న భిన్నంగా చెబుతున్నారు. 
 
ఈ యేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూసిన విషయం తెల్సిందే. అయితే, గత రెండు నెలల్లో ఈ కేసు సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. ఒమిక్రాన్ బీఏ1, బీఏ2 వేరియంట్లు దేశంలో నమోదయ్యాయి. ఈ రెండింటి కలయికే ఎక్స్ఈ వేరియంట్. ఇది ఒమిక్రాన్ వేరియంట్‌తో పోలిస్తే 10 శాతం ఎక్కువ వేగంతో విస్తరించగలదని గుర్తించారు. బ్రిటన్‌లో ప్రస్తుతం అధిక సంఖ్యలో ఈ కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇదిలావుంటే, ఇటీవల 50 యేళ్ల వయస్సున్న సౌతాఫ్రికా మహిళ ఇటీవల ముంబైకు వచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీన ఆమెకు కరోనా వైరస్ సోకింది. ఆమె నమూనాలను సేకరించి కస్తూర్బా ఆస్పత్రిలోని కేంద్ర పరిశోధనాశాలకు పంపించారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఎక్స్ఈ వేరియంట్‌ను గుర్తించినట్టు మహారాష్ట్ర స్టేట్  సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీఫ్ వెల్లడించారు. అయితే, ఈ వేరియంట్‌ను ఎక్స్ఈగా గుర్తించడం తొందరపాటు చర్యే అవుతుందని కేంద్రం పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments