కరోనా వైరస్ వివిధ రూపాలను సంతరించుకుంటూ వస్తుంది. తాజాగా కరోనా ఎక్స్ఈ వైరస్ భారత్‌లో వెలుగు చూసింది. ఇటీవల ఈ వేరియంట్ తొలి కేసు బ్రిటన్‌లో వెలుగు చూసింది. ఇపుడు ముంబై మహానగరంలో నమోదైంది.
ఈ విషయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. దీంతోపాటు మరో కప్పా వేరియంట్ కూడా నమోదైనట్టు తెలిపింది. అయితే, ఈ కొత్త రకం వెలుగు చూసిన బాధితుడులో తీవ్రమైన లక్షణాలేవీ కనిపించలేదన్న చల్లని వార్తను కూడా తెలిపింది.
సాధారణ కోవిడ్ పరీక్షల్లో భాగంగా 230 మంది బాధితుల నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఇందులో 228 మందికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కాగా, ఒకరిలో కప్పా, మరొకరిలో ఎక్స్ఈ వేరియంట్ నమోదైనట్టు పేర్కొంది. అదేసమయంలో ఆస్పత్రిలో చేరిన వారిలో 12 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారేనని చెప్పారు.