Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెండ్ అయిన హ్యాష్‌ట్యాగ్.. భారతరత్న ప్రచారాన్ని ఆపండి ప్లీజ్

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (12:04 IST)
టాటా సంస్థల అధినేత రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని ఆపాలని రతన్ టాటా అభ్యర్థించారు. శుక్రవారం ట్విట్టర్‌లో భారతరత్న ఫర్ రతన్‌టాటా అన్న హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ఈ నేపథ్యంలో శనివారం రతన టాటా తన ట్విట్టర్‌లో స్పందించారు. ఇలాంటి ప్రచారాలను మానివేయాలంటూ రతన్ టాటా ట్విట్టర్ యూజర్లను అభ్యర్థించారు. 
 
ఓ అవార్డు విషయంలో కొందరు సోషల్ మీడియాలో ప్రచారం సాగిస్తున్నారని, అయితే వారి మనోభావాలను గౌరవిస్తానని, కానీ అలాంటి ప్రచారాలను నిలిపివేయాలని సగౌరవంగా వేడుకుంటున్నట్లు రతన్ టాటా తన ట్వీట్‌లో తెలిపారు. భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నానని, దేశ ప్రగతికి సహకరించేందుకు ఎప్పడూ ప్రయత్నిస్తూనే ఉంటానని రతన్ టాటా అన్నారు. 
 
మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ వివేక్ బింద్రా సోషల్ మీడియాలో ఇటీవల క్యాంపేయిన్ స్టార్ట్ చేశారు. రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ట్వీట్ ట్రెండ్ అయ్యింది. ట్విట్టర్ యూజర్ల నుంచి వివేక్ ట్వీట్ కు భారీ మద్దుతు లభించింది. ఈ నేపథ్యంలో రతన్ టాటా తన ట్వీట్‌లో ఇవాళ స్పందించారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments