పియాజ్జియో ఇండియా నేడు తమ టీవీసీ ప్రచారం, మ్యాక్సీఫై లైఫ్‌ను తమ ప్రీమియం వాహనం ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 160 కోసం ఆవిష్కరించింది. ఈ టీవీసీ ప్రచారం అసలైన మ్యాక్సీమైజర్ ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 160 యొక్క సిద్ధాంతాన్ని ప్రతిధ్వనిస్తుంది. తద్వారా తమ రైడర్లకు ప్రతి సందర్భంలోనూ తమ జీవితాలను మ్యాక్సీఫైయింగ్ చేసుకునే అవకాశమూ అందిస్తుంది. ఈ సృజనాత్మ క ప్రకటనలను ప్రింట్, బిల్‌బోర్డ్, డిజిటల్ మరియు టీవీలలో చూడవచ్చు. ఈ ప్రకటనలు ఏప్రిలియా కథానాయకుల విభిన్న భావాలను ఒడిసిపట్టుకుంటాయి, ఎందుకంటే అవి జీవితాన్ని మరింత సమృద్ధి చేస్తాయి.
ఈ ప్రచార ఆలోచనను నూతన తరపు వినియోగదారులు, మ్యాక్సిమైజర్ల గురించి అతి సరళమైన పరిశీలనతో వాస్తవానికి తీసుకువచ్చారు. ప్రతి రోజూ ఆస్వాదించాలని కోరుకోవడమే కాదు, ఆ అనుభవాలను సొంతం చేసుకోవడం ద్వారా జీవితాన్ని మరింతగా వృద్ధి చేయాలనుకుంటారు. ఈ నూతన తరపు ప్రేక్షకుల ప్రతి రోజూ జీవితాన్ని అందంగా ఈ టీవీసీ చూపడంతో పాటుగా, ఏ విధంగా ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 160 అందంగా వారి జీవితాలలో జొప్పించబడుతుందనేది ప్రదర్శిస్తుంది. ఈ చిత్రంలో ఓ కథానాయకుడు, విలాసవంతమైన తన కార్యాలయంలో ఫోన్‌లో మాట్లాడుతుంటాడు.
అదీ అత్యంత ఆకర్షణీయమైన మరియు సౌకర్యవంతమైన ఏప్రిలియా ఎక్‌ఎక్స్‌ఆర్ 160పై సవారీ గురించి ఈ సంభాషణ ఉంటుంది. ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 160పై అతను అత్యంత అందమైన నగర రోడ్లపై సవారీ చేస్తున్నప్పుడు అతను దానిని అసాధారణ ప్రదర్శన కారణంగా పూర్తిగా ఆస్వాదించడంతో పాటుగా అతని ఎస్‌ఎక్స్‌ఆర్‌పై సాయంకాలపు సూర్యకాంతి మరింత అందంగా ప్రకాశిస్తూ, రోడ్డుపై దాని ఠీవిని మరింత భిన్నంగా చూపడమే కాదు, అతని భావోద్వేగాలనూ మారుస్తుంది. అతను తన అపార్ట్‌మెంట్ భవంతి వద్దకు చేరే సరికి, భారీ స్కైసేపర్ కనిపించడం,అతను నేరుగా తన ఎస్‌ఎక్స్‌ఆర్160తో ఎలివేటర్‌లోనికి చేరడం, ఆ ఎలివేటర్ అతని లివింగ్ రూమ్ దగ్గర తెరుచుకోవడం జరుగుతుంది, అక్కడ అతని కోసం ఓ ఊహించని అద్భుతం ఎదురుచూస్తూనే ఉంటుంది.
ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 160ను పరిచయం చేయడం ద్వారా పియాజ్జియో ఇండియా ఇప్పుడు భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఓ సరికొత్త విభాగం సృష్టించడంతో పాటుగా దానిని పునర్నిర్వచించింది. ఈ టీవీసీ ప్రచారం నేడు ఆరంభం కావడంతో పాటుగా లక్ష్యంగా చేసుకున్న వినియోగదారులను చేరుకుని పూర్తి సరికొత్త ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 160 స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది మరియు ప్రీమియం భాగాలను ఏర్పాటుచేస్తుంది మరియు మ్యాక్సీఫై లైఫ్ సిద్ధాంతాన్నీ సమృద్ధి చేస్తుంది.
ఈ ప్రచార ప్రకటన విడుదల చేయడం గురించి శ్రీ డియాగో గ్రాఫీ, ఛైర్మన్‌అండ్ మేనేజింగ్ డైరెక్టర్, పియాజ్జియో ఇండియా మాట్లాడుతూ, ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ 160 అనేది అద్భుతమైన శైలి, అత్యున్నత పనితీరు మరియు మహోన్నత సౌకర్యంకు ప్రతిరూపంగా నిలుస్తుంది. భారతీయ ప్రీమియం ద్విచక్ర వాహన మార్కెట్‌లో అద్భుతమైన సవారీ అనుభవాలను తమ మహోన్నతమైన డిజైన్‌తో అందించడం ద్వారా అత్యున్నత ప్రమాణాలను ఇది సృష్టించేందుకు సిద్ధమైంది.
నూతన టీవీ మరియు ప్రింట్ ప్రచారం ఆవిష్కరణతో, మేము ప్రభావవంతంగా మా సిద్ధాంతాలను మా వివేక వంతులైన వినియోగదారులకు తెలుపనున్నాం. ఈ వినియోగదారులు నూతన తరపు జీవితపు అనుభవాలను గరిష్టం చేస్తుంటారు మరియు ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్160తో వారు తమ జీవితాన్ని మరింత సమృద్ధి చేసుకోగలరని భావిస్తున్నాం అని అన్నారు.