Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిక్కిచ్చే వార్త.. లేడీస్ కోసం ప్రత్యేక మద్యం షాపులు, ఎక్కడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (13:33 IST)
వై షుడ్ బాయ్స్ హావ్ ఆల్ ది ఫన్.. అనే ట్యాగ్‌ లైన్‌ను హీరోయిన్ ప్రియాంక చోప్రా అప్పుడెప్పుడో ఒక కమర్షియల్ యాడ్‌లో చెప్పినట్లు గుర్తు. సరిగ్గా ఇప్పుడు మగువలు కూడా ఎంజాయ్ చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ముఖ్యంగా మద్యం తాగే అలవాటు ఉన్న మహిళలకు ఈ వార్త. 
 
ఇకపై మద్యం కొనేందుకు మగువలు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా వారి కోసం మద్యం షాపులను ఏర్పాటు చేసేందుకు కమల్‌నాధ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
త్వరలోనే ఉమెన్ ఫ్రెండ్లీ లిక్కర్ షాపుల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టింది. ఓన్లీ ఫర్ లేడీస్ కోసం ఏర్పాటు చేస్తున్న ఈ షాపుల్లో ఫారిన్ లిక్కర్ బ్రాండ్స్‌ను మాత్రమే అమ్ముతారట., ఇండోర్‌లలో రెండు.. అలాగే జబల్‌పూర్, గ్వాలియర్‌లో చెరో లిక్కర్ షాప్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. మగువలు ఎక్కువగా ఇష్టపడే వైన్, విస్కీ బ్రాండ్లను వీటిల్లో విక్రయిస్తారని తెలుస్తోంది. ఇక మహిళల సౌకర్యార్ధం మాల్స్‌లో ఈ ప్రత్యేక లిక్కర్ షాపులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
 
మద్యం విక్రయాల ద్వారా సుమారు రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టేందుకే మధ్యప్రదేశ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉమెన్ ఫ్రెండ్లీ లిక్కర్ షాపులతో పాటుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైన్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహిస్తోంది. అటు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కొత్తగా 15 వైన్ షాప్స్‌ను కూడా కమల్‌నాధ్ సర్కార్ ఓపెన్ చేయనుంది. అంతేకాకుండా 2020, ఏప్రిల్ 1 తర్వాత మద్యం ధరలు 15% పెరగనున్నాయి. కాగా, మద్యం ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం