Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజే సౌండ్‌తో మిడతలు పరార్.. పంటపొలాల్లో సౌండ్ బండ్లు

Webdunia
గురువారం, 28 మే 2020 (16:56 IST)
DJ sound
డీజే సౌండ్‌తో మిడతలు పారిపోతున్నాయి. కరోనా వైరస్ తర్వాత భారత్‌లోకి మిడతల దండు పంటలను నాశనం చేస్తుంది. 26 ఏండ్లలో ఎన్నోసార్లు మిడతల దండు మన దేశంలోకి వచ్చాయి. కానీ, ఇంత భారీ సంఖ్యలో దాడి చేయడం ఇదే తొలిసారి అంటున్నారు నిపుణులు.
 
ఈ మిడతల దండును తరిమికొట్టేందుకు కొంతమంది రైతులు సరికొత్తగా డీజేను ఉపయోగిస్తున్నారు. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పోలీస్‌ అధికారి రాహుల్‌ శ్రీవాస్తవ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింద. రాకాసి మిడతలు పంటలను నాశనం చేస్తున్న వేళ.. డీజేను ఉపయోగించి వాటిని రైతులు తరిమికొడుతున్నారు. 
 
ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పంటకు మిడతలు నష్టం కలిగించాయి. 35వేల మందికి సరిపడా ఆహారాన్ని ఈ దండు ఒక్కరోజులో తినేస్తాయట. ఇవి వాటి శరీర బరువుకు మించి ఆహారం తీసుకుంటాయి. 
 
చేతికొచ్చిన పంటను ఈ మిడతల ద్వారా నష్టపోతుంటే చూస్తూ ఉండలేక రైతులు డప్పు కొట్టడం, చప్పట్లు కొట్టడం లాంటి పనులు చేస్తున్నారు. నిరంతరం ఈ పనులు చేయడం కష్టమని డీజే వాహనాన్ని తరలించి పంటపొలాల్లో ప్లే చేస్తున్నారు రైతులు. ఈ శబ్దానికి మిడతలు తోక ముడవక తప్పదంటున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments