సఫారీ పార్కుకు వెళ్లిన జంట.. కారులోపలికి వచ్చిన జిరాఫీ హెడ్.. ఎలా? (వీడియో)

ఇంగ్లండ్‌లోని వార్సెస్టర్‌షైర్‌లో గల పశ్చిమ మిడ్‌ల్యాండ్స్‌ సఫారీ పార్కుకు వెళ్లిన ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. సఫారీ టూర్‌కు వెళ్లిన ఓ జంట కారుకు చేరువలో ఉన్న జిరాఫీని చూస్తోంది. జిరాఫీ కూడా వారి వై

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (18:16 IST)
ఇంగ్లండ్‌లోని వార్సెస్టర్‌షైర్‌లో గల పశ్చిమ మిడ్‌ల్యాండ్స్‌ సఫారీ పార్కుకు వెళ్లిన ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. సఫారీ టూర్‌కు వెళ్లిన ఓ జంట కారుకు చేరువలో ఉన్న జిరాఫీని చూస్తోంది. జిరాఫీ కూడా వారి వైపు చూస్తూ కారు అద్దం సగం తెరిచి వుండటంతో తల లోపలికి పంపింది. అంతే టూర్‌కెళ్లిన జంట షాక్ తింది.
 
ఆహారం కోసం రయ్‌మంటూ కారువైపుకు దూసుకొచ్చిన జిరాఫీ.. ఏకంగా కారు అద్దాల్లో నుంచి తలను లోపలికి దూర్చింది. అప్పటివరకూ పొడుగుకాళ్ల జిరాఫీని చూసి తెగ సంబరపడిన ఆ జంట.. దగ్గరిగా వచ్చేసరికి భయాందోళనలకు గురై బిగ్గరగా కేకలు వేశారు. కారులో నుంచి తలను వెనక్కి తీసుకొనే క్రమంలో జిరాఫీ తల కారు అద్దాలకు తగిలి పగిలిపోయాయి. 
 
దంపతుల చేతిలో ఆహారాన్ని అందుకునేందుకు కారులో జిరాఫీ తల లోపలికి పెట్టిందని సఫారీ అధికారులు వెల్లడించారు. అయితే ఘటనలో జిరాఫీకి ఎలాంటి గాయాలు కాలేదని.. జిరాఫీ కూడా ఆహారం తీసుకున్నాక కారు నుంచి తలను బయటికి తీసేయడంతో ఆ జంట ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments