Webdunia - Bharat's app for daily news and videos

Install App

25ఏళ్ల నిక్‌తో 35ఏళ్ల ప్రియాంక లవ్వాయణం.. జంటగా ప్రయాణం ఎక్కడికి?

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రేమలో పడింది. అమెరికా సింగర్ నిక్ జోనాస్‌తో ప్రియాంకా చోప్రా ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తలను నిజం చేసేలా ప్రియాంక చోప్రా నిక్ జోనాస్‌తో

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (15:17 IST)
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రేమలో పడింది. అమెరికా సింగర్ నిక్ జోనాస్‌తో ప్రియాంకా చోప్రా ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తలను నిజం చేసేలా ప్రియాంక చోప్రా నిక్ జోనాస్‌తో కలిసి చక్కర్లు కొడుతోంది. 
 
క్వాంటికో, బేవాచ్ లతో అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగిన ప్రియాంకా చోప్రా.. ఆమెకు 35 ఏళ్లైనప్పటికీ.. 25ఏళ్ల నిక్‌తో కలసి ఇటీవలి కాలంలో పలుమార్లు కెమెరాకు చిక్కింది. తాజాగా వీరిద్దరూ అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి కెమెరా కంటికి చిక్కారు. వీరిద్దరూ కలిసి ప్రయాణం చేసినట్లుండే ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమయ్యాయి. 
 
ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు మాత్రం సినిమా పనిలో భాగంగా వీరిద్దరూ కలుసుకుంటున్నారని చెప్తున్నారు. వీరిద్దరూ కలిసి ఓ సినిమా ప్రాజెక్టు చేస్తారని.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. 
 
ఇటీవల నిక్‌-ప్రియాంకా లాస్ ఏంజెల్స్‌లో బాస్కెట్ బాల్ మ్యాచ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తీయించుకున్న ఫోటోలను ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments