బెంగళూరు ట్రాఫిక్ కష్టాల గురించి అందులో ఇరుక్కున్నవారికే తెలుసు. పీక్ టైంలో రోడ్లపై వాహనాలు గంటలకొద్దీ నిలిచిపోతుంటాయి. ఈ రద్దీలో ఇరుక్కుపోయినవారు విలవిలలాడిపోతుంటారు.
బెంగుళూరు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి వుండటం అక్కడి వాహనదారుల్లో చాలామందికి అలసిపోయే అనుభవంగా ఉంటుంది. అంతేకాదు ప్రయాణీకులు సమయాన్ని గడపడానికి వినూత్న మార్గాలను అవలంభిస్తుంటారు. ఇటీవల, ఒక మహిళ ఎలాగూ తను ట్రాఫిక్‌లో చిక్కుకోవడం ఖాయం కనుక ఆ గ్యాప్‌లో ఏం చేయాలో నిర్ణయించుకున్నట్లుంది.