Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు దశాబ్దాలుగా పెండింగ్‌ : మహిళా బిల్లుకు త్వరలో మోక్షం??

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2023 (17:21 IST)
గత మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లుకు త్వరలోనే మోక్షం లభించనున్నారు. సోమవారం నుంచి ప్రత్యేకంగా సమావేశమైన పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లుకు మోక్షం లభించేలా కేంద్రంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం పావులు కదుపుతుంది. ఈ నెల 20వ తేదీ బుధవారం ఈ బిల్లును బీజేపీ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి ఆమోదించవచ్చని భావిస్తున్నారు. 
 
ఇదే జరిగితే గత మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లుకు మోక్షం లభించినట్టే. ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయాలని అనేక రాజకీయ పార్టీలతో పాటు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ బిల్లును సభలో ప్రవేశపెడితే ఈ బిల్లును ఆమోదిస్తూ అన్ని పార్టీలు మద్దతిచ్చి పాస్ చేసేందుకు పూర్తి అకాశాలు ఉన్నాయి. 
 
ప్రస్తుత 17వ లోక్‌సభలో 15 శాతం కంటే దిగువన మహిళా ఎంపీలు ఉన్నారు. 2022లో రాజ్యసభలో 28.3 శాతం మహిళలు ఉన్నారు. 1952లో లోక్‌సభలో మహిళా ఎంపీలు 4.4 శాతం, రాజ్యసభలో 2 శాతంగా ఉండేవారు. దేశ జనాభాలో దాదాపు సగం మేరకు మహిళలు ఉన్నారు. దీంతో వీరికి చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశాల్లో మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments