Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్ కష్టాలు.. బైక్‌పై సోదరి మృతదేహంతో సోదరుడు...

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (09:51 IST)
అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో సోదరి మృతదేహాన్ని ఓ సోదరుడు తన బైకుపై ఇంటికి తీసుకెళ్లిన హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని ఔరైయా జిల్లాలోని నవీన్ బస్తీలో నివాసం ఉంటున్న ప్రతాప్ సింగ్ కుమార్తె అంజలి (20).. ఆన్ చేసివున్న వాటర్ హీటర్‌ను ప్రమాదవశాత్తు తాగింది. దీంతో ఆమె ఎలక్ట్రిక్ షాక్‌కు గురైన కొద్దిసేపటికే పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను బిధునా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
ఆ తర్వాత అంజలి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య సిబ్బందిని సోదరుడు కోరాడు. అయితే, ఆ సమయంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో అంజలి మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి బైకుపై ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు స్థానికులు అక్కడి కనిపించిన హృదయ విదారక ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments