హీరో కార్తి తన 25వ చిత్రం జపాన్ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
జివి ప్రకాష్ కుమార్ జపాన్ కోసం చార్ట్ బస్టర్ ఆల్బమ్ ని కంపోజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి టచ్చింగ్ టచ్చింగ్ పూర్తి వీడియో సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పెప్పీ అండ్ క్యాచి మ్యాసీ నెంబర్ ని ఇంద్రావతి చౌహాన్ కలిసి స్వయంగా కార్తి ఆలపించారు. కార్తి వాయిస్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే భాస్కరభట్ల అందించిన లిరిక్స్ మాస్ అప్పీలింగ్ గా వున్నాయి.
ఈ పాటలో కార్తి, అను ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ ఫ్యాషనేటింగ్ అండ్ కలర్ ఫుల్ గా వుంది. కార్తి, అను ఇమ్మాన్యుయేల్ డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేశాయి. విజువల్స్ చాలా ఎట్రాక్టివ్ గా వున్నాయి. ముఖ్యంగా కార్తి జపాన్ గెటప్, మ్యానరిజం ఎక్స్ ట్రార్డినరీ గా వుంది.
జపాన్ కార్తీకి క్రేజీ క్యారెక్టర్. ఎక్స్ ట్రార్డినరీ మేకోవర్ తో కార్తి పూర్తిగా భిన్నమైన అవతార్‌లో అలరించనున్నారు. ఈ చిత్రంలో కేఎస్ రవికుమార్, సునీల్, విజయ్ మిల్టన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎస్ రవి వర్మన్ డీవోపీ పని చేస్తుండగా ఫిలోమిన్ రాజ్ ఎడిటర్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మరసంభవం) వినేష్ బంగ్లాన్ జపాన్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జపాన్ 'దీపావళి' కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలౌతుంది.