Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌లో సీఎంలిద్దరూ సైంటిస్టులు : నెటిజన్స్ ట్రోల్స్

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (08:22 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డిలను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. కరోనా వైరస్‌లో సీఎంలిద్దరూ సైంటిస్టులు అయ్యారంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. కరోనా వైరస్‌కు ఒక్క పారాసిటమాల్ మాత్ర సరిపోతుందనీ, ఈ వైరస్ గురించి అంతగా ఆందోళన చెందనక్కర్లేదంటూ వారు సలహా ఇవ్వడమే వారిద్దరినీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి కారణం. 
 
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచమే నిర్భంధంలోకి వెళ్లింది. ప్రజలు తమతమ నివాసాలు విడిచి బయటకు రావొద్దంటూ ఆంక్షలు విధించారు. పైగా, ఈ వైరస్ సోకిన రోగికి సరైన మందు కూడా లేదు. అందుకే 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో నిర్బంధించి, చికిత్స అందిస్తున్నారు. 
 
కానీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఓ చిన్న సలహా ఇచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. కరోనా వైరస్ కట్టడి విషయంలో కూడా వీరిద్దరూ ఒకే ఆలోచనకు వచ్చారు. అయితే వయసులో కేసీఆర్ పెద్ద కావడంతో ఆయన తన అభిప్రాయాన్ని ముందుగానే వ్యక్తం చేశారు. కేసీఆర్ కంటే పిన్న వయస్కుడైన జగన్ కూడా కాస్త ఆలస్యంగా కేసీఆర్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు ప్రకటించి, తమ ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు ఒకటేనని ప్రజలకు చాటిచెప్పారు. కరోనాను నివారించేందుకు కేవలం ఓ పారాసిటమాల్ మాత్ర వేసుకుంటే చాలని ఇద్దరు సీఎంలు సెలవిచ్చారు. 
 
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కరోనా నివారణపై ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ కూడా ఇలానే సమాధానం చెప్పారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని, జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా వేసుకునే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందన్నారు. రాష్ట్రానికి కరోనా వైరస్ రాదని, తాము ఆ వైరస్‌ను రానివ్వమని స్పష్టం చేశారు. 22 డిగ్రీల ఉష్టోగ్రత దాటితే కరోనా వైరస్ బతకలేదన్నారు. 
 
ఆదివారం మీడియా ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి... కరోనాను నివారించాలంటే పారాసిటమాల్ సరిపోతుందని ప్రకటించారు. అయితే కరోనాపై ఇద్దరి అభిప్రాయాలు ఒకటే కావడంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. కరోనా వైరస్‌లో సీఎం లిద్దరూ సైంటిస్టులు అయ్యారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పారాసిటమాల్ అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉంది. కేసీఆర్ జగన్ లిద్దరూ సీఎంలు మాత్రమే కాదని సైంటిస్టులు అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్కినేని ఫ్యామిలీలో వరుస వివాహ వేడుకలు... ముమ్మరంగా ఏర్పాట్లు!!

దివ్యప్రభ న్యూడ్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్... పాపులారిటీ కోసమేనా (Video)

తుదిదశలో 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments