Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్‌కు గోమూత్రంతో విరుగుడు

కరోనా వైరస్‌కు గోమూత్రంతో విరుగుడు
, ఆదివారం, 15 మార్చి 2020 (14:09 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నారు. ఈ వైరస్‌ విరుగుడుకు ఇప్పటివరకు మందు కొనగొనలేదు. దీంతో ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడ్డారు. ఇలాంటి వైరస్‌కు గోమూత్రం చక్కని ఔషధంగా పని చేస్తుందని అఖిల భారతీయ హిందూ మహాసభ పేర్కొంది. 
 
ఈ మేరకు 'గోమూత్ర పార్టీ' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో స్వామి చక్రపాణి మహరాజ్ సహా ఆయన బృంద సభ్యులు గోమూత్రాన్ని తాగారు. అంతేకాదు, కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 200 మంది కూడా గోమూత్రాన్ని తాగారు. 
 
ఈ సందర్భంగా స్వామి చక్రపాణి మాట్లాడుతూ.. గోమాంసం తిన్నందు వల్లే కేరళలో వరదలు సంభవించాయన్నారు. గోమూత్రం తాగితే కరోనా దరిచేరదన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి 'గోమూత్ర పార్టీ'లను మరిన్ని నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచుతామని ఈ సందర్భంగా స్వామి చక్రపాణి మహరాజ్ పేర్కొన్నారు.
 
తాము 21 సంవత్సరాల నుంచి గోమూత్రం తాగుతున్నామని, ఆవు పేడతో స్నానం చేస్తున్నామని పార్టీకి హాజరైన ఓ ప్రకాశ్ తెలిపారు. ఈ కారణంగా ఇంగ్లీష్ మందులు వాడాల్సిన అవసరం తమకు రాలేదన్నారు. కేన్సర్‌ను నివారించేందుకు గోమూత్రం చక్కని ఔషధంలా పనిచేస్తుందని కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేతలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇద్దరు పిల్లల ప్రిన్సిపాల్... ఉపాధ్యాయురాలితో రెండో పెళ్లి