Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెను అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించిన జిల్లా కలెక్టర్

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (16:41 IST)
తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకోసం ఎంత డబ్బు అయినా వెచ్చించేందుకు వెనుకంజ వేయరు. దీంతో అనేక ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఫలితంగా ప్రతి ఒక్కరూ కార్పొరేట్ విద్య కోసం వెంపర్లాడుతున్నారు. 
 
అయితే, ఆ జిల్లా కలెక్టర్ మాత్రం కార్పొరేట్ విద్యకు పూర్తి విరుద్ధం. అందుకే తన బిడ్డను ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించారు. ఆర్థిక స్థోమతగా అంతగాలేని నిరుపేదల పిల్లలే ఎక్కువగా ఈ కేంద్రాల్లో చేరుతుంటారు. 
 
ఆ కలెక్టర్ పేరు శిల్పా ప్రభాకర్. తిరునెల్వేలి జిల్లా కలెక్టరుగా ఉన్నారు. ఈమె తన కుమార్తెను ప్లేస్కూల్‌కు పంపించకుండా పాలయంకోట్టలోని ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించారు. దీనిపై ఆమె స్పందిస్తూ, 'ఏమీ అనుకోవద్దు. మేం కర్ణాటక వాసులం. అయితే నా కూతరు అంగన్‌వాడీలో చిన్నప్పటి నుంచే తమిళం నేర్చుకుంటుండటం ఆనందంగా ఉంది. నా కూతరు అన్ని రకాల సమూహాల ప్రజలతో కలిసి మమేకం కావాలి. వారి నుంచి ఎంతో నేర్చుకోవాలి' అని పేర్కొంది. 
 
ఈ అంగన్‌వాడీ కేంద్రం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో ఉంది. పైగా, అన్ని వసతులతో ఈ కేంద్రం ఉండటంతో జిల్లా కలెక్టర్ తన కుమార్తెను ఇక్కడ చేర్పించారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నారు. 
 
ఈ అంగన్‌వాడీ కలెక్టరేట్‌కు సమీపంలోనే ఉంది. అన్ని వసతులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా కలెక్టర్ శిల్పా ఎంతో మంది హృదయాలను గెలుచుకుందని సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజెన్లు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments