Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఓటమికి వైఎస్ అభిమానులే కారణం : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (16:38 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీల నేతృత్వంలో ఏర్పాటైన ప్రజాకూటమి ఓడిపోవడానికి గల కారణాలపై తెరాస నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ అభిమానుల వల్లే ఓడిపోయినట్టు సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్, జగన్ అభిమానులు, మద్దతుదారులు భారీగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. అందువల్లే తాము ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. 
 
ఇకపోతే, తమ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అధికార తెరాసలోకి చేరుతారంటూ వస్తున్న ఊహాగానాలపై జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ తెరాసలో చేరబోరనని స్పష్టంచేశారు. అదేసమయంలో సీఎల్పీ పదవిని తనకు ఇవ్వాలని కోరనున్నట్టు చెప్పారు. ఎందుకంటే తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టు చెప్పారు. అలాగే, మెదక్ లోక్‌సభ సీటును తన భార్యకు ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటానని జగ్గారెడ్డి వెల్లడించారు. 
 
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీలు పొత్తు పెట్టుకోవడానికి కారణం లేకపోలేదన్నారు. కేవలం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ రెండు పార్టీలు చేతులు కలపాల్సి వచ్చిందన్నారు. అంతేకానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని అనడం ఏమాత్రం సబబు కాదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments