Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాకు దూరంగా...

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (07:33 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆయన ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవడానికి గల కారణాలను మాత్రం తెలియలేదు. 
 
నిజానికి ప్రధాని నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న నేతల్లో ఆయన కూడా ఒకరు. అలాంటి మోడీ... ఈ ఆదివారం నుంచి తాను సోషల్ మీడియా అకౌంట్లకు దూరంగా ఉండాలని భావించినట్టు తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. 
 
ట్విట్టర్‌తో ఫాటు.. ఇతర సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను, కానీ మీరందరూ పోస్టులు చేస్తుండాలి అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనదైనశైలిలో స్పందించారు. వదిలేయాల్సింది సోషల్ మీడియాను కాదని, విద్వేషాన్ని వదిలేయాలని రాహుల్ హితవు పలికారు. అటు, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రధాని నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. 
 
మన ప్రధాని నరేంద్ర మోడీ అకౌంట్‌ను ఎవరూ హ్యాక్ చేయలేదు కదా! అంటూ చమత్కరించారు. లేకపోతే, డిజిటల్ మాలిన్యాలను తొలగించే సున్నితమైన ప్రక్రియ గురించి ఏమైనా సంకేతాలు ఇస్తున్నారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. మొత్తంమీద ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం ఇపుడు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. 

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments