Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫోన్ నెంబర్ అడిగిన బాలీవుడ్ నటుడు.. సన్నీ లియోన్ ఏం చేసిందంటే?

Advertiesment
ఫోన్ నెంబర్ అడిగిన బాలీవుడ్ నటుడు.. సన్నీ లియోన్ ఏం చేసిందంటే?
, ఆదివారం, 1 మార్చి 2020 (16:17 IST)
పోర్న్ కప్ స్టార్ హీరోయిన్‌గా మారిన సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. ఇంకా హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ప్రేక్షకులను పలకరించింది. ఈ బోల్డ్ బ్యూటీని తాజాగా సీనియర్ నటుడు పలకరించి, ఫోన్ నెంబర్ అడిగారట. దీనికి సన్నీ స్పందించిన తీరు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. డబూ రత్నానీ క్యాలెండర్ కోసం హీరోయిన్ల సెమీ న్యూడ్ ఫోటోలు షూట్ చేస్తున్నారు. 
 
ఇందుకోసం పాపులర్ అండ్ హాట్ బ్యూటీలను ఎంపిక చేసుకుని వారితో ఆ ఫోటో షూట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సన్నీలియోన్, కైరా అద్వానీ లాంటి బోల్డ్ బ్యూటీస్ హాట్ ఫోటోలను తీశారు. ఇందుకోసం కైరా ఆకు చాటున అందాలు దాచిపెట్టగా, సన్నీలియోన్.. ఓ పుస్తకాన్ని తన అందాలకు అడ్డుపెట్టేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
 
ఈ ఫోటో షూట్ జరుగుతున్న సమయంలో సన్నీలియోనీతో పాటు ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కూడా ఉన్నారట. ఫొటో షూట్ పూర్తికాగానే సన్నీ ఫోన్ నెంబర్ అడిగారట కబీర్ బేడీ. దీంతో వెంటనే రియాక్ట్ అయిన సన్నీ అతనికి షాకిస్తూ తెలివిగా తప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. 
 
సినీ ఇండస్ట్రీలో కబీర్ బేడీ ఓ సీనియర్ నటుడు కాబట్టి.. నెంబర్ ఇవ్వనంటే ఫీల్ అవుతాడేమో అని భావించి, తన నెంబర్‌కి బదులుగా తన భర్త డేనియల్ వెబర్ నెంబర్ ఇచ్చేసిందట. ఈ విషయం తెలుసుకున్న కబీర్ షాక్ అయినట్లు సోషల్ మీడియా వార్తలు వస్తున్నాయి. ఏమైనా సన్నీ లియోన్ తెలివిగా తప్పించుకుందని.. సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీచ్‌లో సేద తీరుతున్న ఇలియానా.. ఫోటోలు వైరల్