Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రుడిపై శృంగారం.. కానీ కుదర్లేదు.. మూన్‌ రాక్స్‌‌ను పడకపై వేసుకుని..?

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (20:56 IST)
చంద్రుడిపై శృంగారం చేయాలని భావించాడు.. అమెరికన్ స్పేస్ ఆర్గనైజేషన్‌ నాసా ఇంటర్న్‌షిప్‌ చేసిన వ్యక్తి. ఈ వింత కోరిక కోసం అతడు ఏం చేశాడంటే..? దాదాపు 19 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. థాడ్ రాబర్ట్స్ 2002 లో అమెరికన్ స్పేస్ ఆర్గనైజేషన్‌ నాసా ఇంటర్న్‌షిప్‌ చేశాడు‌. అతడి గర్ల్‌ఫ్రండ్‌ టిఫాని ఫ్లవర్స్‌ కూడా అక్కడే ఇంటర్న్‌షిప్‌ చేసింది. 
 
ఈ క్రమంలో వారికి ఓ వింత కోరిక కలిగింది. చంద్రుడి మీద శృంగారం చేయాలని భావించారు. ఇది సాధ్యం కాదని వారికి తెలుసు. అందుకే నాసా అపోలో వ్యోమనౌక ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి భూమి మీదకు తీసుకువచ్చిన రాళ్లను దొంగలించారు. వాటిని బెడ్‌ మీద పెట్టుకుని.. వాటిపై పడుకుని.. తమ కల నేరవేర్చుకోవాలని భావించారు. అనుకున్నట్లే చంద్రుడి మీద నుంచి తెచ్చిన రాళ్లను దొంగతనంగా తమ గదికి తీసుకెళ్లి.. వారి కోరిక తీర్చుకున్నారు. 
 
ఇక ఈ రాళ్లకు చాలా విలువ ఉంటుంది. ఈ నేపథ్యంలో బెల్జియన్‌ ఔత్సాహిక ఖనిజ శాస్త్రవేత్త ఈ మూన్‌ రాక్‌ని కొనడానికి ఉత్సాహం చూపాడు. అయితే వీరి ప్రయత్నానికి నాసా బ్రేక్‌ వేసింది. మూన్‌ రాక్స్‌ దొంగిలించబడినవి అని గుర్తించిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి విచారణ చేయగా రాబర్ట్స్‌, అతడి బ్యాచ్‌ చేసిన నిర్వాకం గురించి తెలిసింది. వీరిపై పోలీసు కేసు నమోదు చేశారు. కోర్టు రాబర్ట్స్‌కి ఎనిమిదేళ్ల శిక్ష విధించింది.  
Thad Roberts
 
ప్రస్తుతం జైలులో ఉన్న కాలంలో రాబర్ట్స్ భౌతికశాస్త్రం, మానవ శాస్త్రం, తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఇప్పుడు అతడి వయసు 44 సంవత్సరాలు. ప్రస్తుతం అతను ఓ ప్రముఖ కంపెనీలో అత్యున్నత స్థాయిలో విధులు నిర్వహిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments