Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూమికి ప్రమాదం పొంచి వుందా? మార్చి 21న ఏం జరుగబోతోంది?

భూమికి ప్రమాదం పొంచి వుందా? మార్చి 21న ఏం జరుగబోతోంది?
, శనివారం, 13 మార్చి 2021 (19:58 IST)
Earth
భూమికి ప్రమాదం పొంచి వుందా? మార్చి 21న ఏం జరుగబోతోంది? అనే ప్రశ్న శాస్త్రవేత్తలను కలచి వేస్తోంది. ఈ ఏడాది మార్చి 21న భూమికి 1.25 మిలియన్ల మైళ్లు (దాదాపు 20 లక్షల కిలోమీటర్లు) దూరానికి చేరుకుంటుందని ప్రకటించారు. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలాన్ని చాలా అరుదుగా చూసే అవకాశముందని అమెరికా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఇది భూమిని తాకే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. త్వరలో ఓ గ్రహశకలం భూమికి చేరువగా రానున్నట్లు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళ్తే.. భూమికి అతిచేరువలో రానున్న ఈ ఆస్ట్రాయిడ్ పేరు 2001 FO32. ఇది 3000 అడుగుల వ్యాసం ఉన్నట్లు అంచనావేశారు. తొలుత దీన్ని 20 ఏళ్ల క్రితం కనుగొన్నట్లు నాసా వెల్లడించింది. ఈ గ్రహశకలం భూమి వద్దకు 20 లక్షల కిలోమీటర్ల దురానికి మించి రాదని ఆయన చెప్పారు. 
 
ఈ దూరం చంద్రుడు-భూమికి మధ్య ఉన్న దూరం కంటే 5.25 రెట్లు ఎక్కువ. అయినప్పటికీ ప్రమాదకర గ్రహశకలాల జాబితాలో దీన్ని కూడా వర్గీకరించవచ్చని నాసా చెప్తోంది. 2001 FO32 లేదా అంతకంటే పెద్ద పరిమాణంలో ఉన్న భూమికి సమీపంలో ఉన్న గ్రహశకలాలకు సంబంధించి 95 శాతానికి పైగా జాబితా చేయబడింది. వచ్చే శతాబ్దం వరకు వీటిలో ఏవి మన గ్రహంపై ప్రభావం చూపవని నాసా తెలిపింది.
 
భూమిని తాకేందుకు ఇతర గ్రహశకలాల పోలిస్తే 2001 FO32 ఆస్ట్రాయిడ్ గంటకు 77 వేల మైళ్ల వేగంతో వెళ్తుందని నాసా తెలిపింది. ప్రస్తుతం ఈ ఆస్ట్రాయిడ్ గురించి పెద్దగా తెలియదని, దీని గురించి మరింత క్షుణ్నంగా తెలుసుకోవడాననికి ఇది అద్భుతమైన అవకాశమని నాసా జెట్ ప్రోపల్షన్ లేబరేటరీ ప్రధాన శాస్త్రవేత్త లాన్స్ బెన్నర్ అన్నారు.
 
ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం పరిమాణాన్ని అర్థం చేసుకోవాలని, ఉపరితలం నుంచి ప్రతిబింబించే కాంతి అధ్యయనం చేయడం ద్వారా దీని గురించి తెలుసుకోవాలని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యరశ్మి ఈ ఆస్ట్రాయిడ్ ఉపరితలాన్ని తాకినప్పుడు శిలలోని ఖనిజాలు.. కొన్ని తరంగదైర్ఘ్యాలను గ్రహిస్తాయి. మరికొన్నింటిని ప్రతిబింబిస్తాయని నాసా చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొదటి భర్త అలా చేస్తున్నాడని భార్య ఏం చేసిందంటే?