పెళ్లైన ఆరు నెలలకే తేజ్ ప్రతాప్ యాదవ్-ఐశ్వర్యారాయ్ విడాకులు.. ఎందుకు?

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (13:55 IST)
పెళ్లైన ఆరు నెలలకే బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. తన భార్య ఐశ్వర్యారాయ్ నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పట్నా కోర్టులో శుక్రవారం ఆయన విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకుల కోసం దరఖాస్తు చేయడం ప్రస్తుతం బీహార్‌లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఐశ్వర్య తల్లిదండ్రులు ఈ విషయం గురించి చర్చేందుకు లాలు ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి ఇంటికి వెళ్లడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  ఈ విషయంపై కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు నచ్చచెప్పినప్పటికీ.. తేజ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని సమాచారం. ఈ విషయంపై తేజ్ ప్రతాప్ యాదవ్ కుటుంబసభ్యులు ఎవరూ స్పందించడానికి ఇష్టపడలేదు.
 
కాగా.. ఈ ఘటనపై తేజ్ ప్రతాప్ యాదవ్ లాయర్ యశ్వంత్ కుమార్ శర్మ మీడియాకు వివరణ ఇచ్చారు. తేజ్, ఐశ్వర్యల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగానే వారు విడిపోవాలనుకుంటున్నట్లు తెలిపారు. వారు వారి బంధాన్ని కొనసాగించాలనుకోవడం లేదని చెప్పారు. 
 
దీంతో.. హిందూ చట్ట ప్రకారం విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని వివరించారు. కాగా ఈ ఏడాది మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యారాయ్‌ల వివాహం జరిగింది. ఈ వివాహానికి భారీ ఎత్తున అతిథులు హాజరైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments